ఏపీ బీజేపీ పెద్దలు.. సొంత పార్టీ నేతలనే నమ్మడం లేదా.. ఏం..!

MOHAN BABU
ఏపీలోని బీజేపీ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల్లో పోటీ కాదు కదా కనీసం పోటీ స్పెల్లింగ్ కూడా స్పష్టంగా చెప్పలేకపోతోంది. అలాంటి పార్టీ టిడిపి లాంటి పార్టీలకు పార్కింగ్ ప్లేస్ గా మారిందా అంటే ఏమో కమలం పార్టీ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ చూస్తుంటే అలానే ఉంది మరి. టిడిపి నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీలతో పాటు  పలువురు నేతల విషయంలో ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్న  కొందరు టిడిపి నేతలు పైకి కాషాయం కండువా కప్పుకున్నా మనసులో పసుపు రంగు మాత్రం అలానే ఉందనేది వారి అనుమానం. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  సునీల్ దియోధర్ చేసినటువంటి వాఖ్యలు పార్టీలో వేడి పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏమన్నారు.

ప్రత్యేకంగా ఆ ముగ్గురు మీద ఆయనకు ఎందుకంత కోపం ? ఈ మాటలు అటు తిరిగి ఇటు తిరిగి బద్వేల్ ఉప ఎన్నిక మీద ప్రభావం చూపిస్తాయా ? నిజంగా వలస నేతలకు బిజెపి పార్కింగ్ ప్లేస్ గా మారిందా ? కొద్దిరోజులు షెల్టర్ తీసుకుని ఆ తర్వాత ఎవరి సైకిల్ వారు తీసుకొని వెళ్ళిపోతారా ? పరిస్థితులు బాగా లేకనే  బిజెపి కార్యాలయం ముందు తమ సైకిళ్లు పార్కు చేస్తున్నారా ? టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన వారిలో కోవర్టులు ఉన్నారా ? విజయవాడలో ఓ బేటీ జరిగింది. బిజెపి అనుబంధ సంస్థల పనితీరుపై రివ్యూ చేసేందుకు సమావేశమయ్యారు. పార్టీకి పెద్ద దిక్కు లాంటి సునీల్ దియోధర్ పుసుక్కున ఓ మాట ఘాటుగానే అనేసారు. వలస నేతలు కొందరు  బీజేపీని బీచ్ పార్కింగ్ ప్లేస్ లా వాడుకుంటున్నారంటూ  కామెంట్ చేశారు. దీంతో సమావేశంలో ఒక్కసారిగా కలకలం మొదలైంది.

2019లో టిడిపి ఓటమి తర్వాత నలుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ లోకి జంప్ చేశారు. వీళ్ళు ఎందుకు చేరారు  అనేది పక్కన పెడితే కేసుల నుంచి తప్పించుకోవడానికే బిజెపిని కొందరు పార్కింగ్ ప్లేస్ లాగా వాడుకుంటున్నట్లు చేసినటువంటి వాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీని కారణంగానే ఆ ముగ్గురి నేతలకు పార్టీ సమావేశాలకు ఆహ్వానం అందడం లేదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: