నేడు నాతో ఉన్నొళ్లు రేపు ఉండ‌డం లేదు.. ఈట‌ల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!

N ANJANEYULU
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హిస్తున్న ఉపఎన్నిక పోరు రోజు రోజుకు ఉత్కంఠ భ‌రితంగా మారుతున్న‌ది. త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేసేందుకు నేత‌లు త‌మ త‌మ వ్యూహాలు ర‌చించుకుంటున్నారు. తాజాగా మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌చారంలో మాట్లాడారు. చిన్న చిన్న నేత‌ల‌తో జంపింగ్‌ల‌పై బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి. ఏ రోజు ఎవ‌రు ఏ క్యాంపు వ‌ద్ద ఉంటున్నారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. నేటి వ‌ర‌కు నాతో ఉన్న వారంద‌రూ రేపు ఉండ‌టం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వాళ్ల‌ని గెలిపించుకున్న‌ది మ‌నం కాదా..? వాళ్ల‌కు నా అండ లేకుండేనా..? అని ఓట‌ర్ల‌ను ప్ర‌శ్నించారు ఈట‌ల‌.

చోట నాయ‌కులు ఎంత‌మంది వెళ్లినా ఓట‌ర్ల దేవుళ్ల‌యిన  ప్ర‌జ‌లు ఎప్పుడు త‌న‌వెంటే ఉంటార‌ని పేర్కొన్నారు. అందుకు ఈరోజు నిర్వ‌హించిన ర్యాలీ నిద‌ర్శ‌నం అన్నారు.  త‌న‌ను జ‌మ్మికుంట‌లో క‌వాతు చేప‌ట్టాల‌ని మ‌హిళ‌లు కోరారు. త‌ప్ప‌కుండా చేద్దామ‌న్నారు.  ఆనాడు కురుక్షేత్ర యుద్ధంలో  ధ‌ర్మం ఎలా గెలిచిన‌దో.. నేడు ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా అలాగే గెలుస్తార‌ని పేర్కొన్నారు. నాయ‌కుల‌ను ఖ‌తం పెట్టాల‌ని కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్లాన్ వేస్తే.. మంత్రి హ‌రీశ్‌రావు అమ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

ఇక్క‌డ గెలిచిన మున్సిప‌ల్ చైర్మ‌న్‌, కౌన్సిల‌ర్ల‌ను గెలిపించింది మ‌నం కాదా..?  నా యొక్క అండ వారికి లేదా..?  ఇప్పుడొక్క‌డు లేడు. ఊరంతా ఒక‌దారి. ఊస‌ర‌వెళ్లిది ఒక‌దారి అన్న‌ట్టు వెళ్లిపోయారు. ఎంత‌మంది నాయ‌కులు వెళ్లినా ప్ర‌జ‌లు నాతో  ఉన్నారు అన‌డానికి ఇదే నిద‌ర్శ‌నం అని పేర్కొన్నారు. త‌న పేరు చెప్పుకోకుండా టీఆర్ఎస్ నాయ‌కుల‌కు మొహం చెల్ల‌డం లేద‌ని తెలిపారు. ద‌స‌రా పండుగ రోజు ఓట‌ర్ల‌కు వాళ్లే మాంసం,  మందు, డ‌బ్బు పంపిణీ చేస్తారంట‌. ఒక్క ఓటుకు రూ.10వేలు ఇస్తార‌ట‌. రూ.50వేలు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం త‌న‌కు వేయాల‌ని ఈట‌ల కోరారు.  మ‌రో వైపు ఈట‌ల‌కు దీటుగా టీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల అభ్య‌ర్థులు జోరుగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. చివ‌ర‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో ఎవ‌రు గెలిచి నిలిచేనో న‌వంబ‌ర్ 2 వ‌ర‌కు వేచి ఉండ‌క త‌ప్ప‌దు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: