నోరు జారిన మంత్రి.. మహిళలు ఆగ్రహం.. ఇంతకీ ఏమన్నారంటే?

praveen
సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు ఎప్పుడు ఆచి తూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా పొరపాటున నోరు జారి మాట్లాడారు అంటే చాలు ఇక వారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారిపోతూ ఉంటాయి. అంతే కాదు తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలకు గురవుతుంటాయి. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే ఆచి తూచి మాట్లాడాల్సిన ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు రాజకీయ నాయకులు కొన్ని కార్యక్రమాలు లో మాట్లాడుతూ మాట్లాడుతూ  సంచలన వ్యాఖ్యలు చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా రాజకీయ నాయకులు పొరపాటున చేసిన వ్యాఖ్యలపై ఎంతోమంది విమర్శలు గుప్పిస్తూ ఉంటారు.



 ఇప్పటికే ఎంతోమంది రాజకీయ నాయకులకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇటీవలే ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ గా మారిపోయాయి. ప్రస్తుతం కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె సుధాకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆధునిక భారతీయ మహిళలు ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా పిల్లలను కనడానికి నేటి రోజుల్లో మహిళలు ఇష్టపడటం లేదని సరోగసీ ద్వారా సంతానం పొందడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అంటూ ఆరోగ్య శాఖ మంత్రి కే సుధాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.



 ఇటీవల నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం లో పాల్గొన్నారు ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్. ఇక ఈ కార్యక్రమంలో ఈ హాట్ కామెంట్స్ చేశారు. ఈ విషయం చెబుతున్నందుకు  క్షమించండి ఆధునిక భారత మహిళలు చాలామంది ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. వివాహం చేసుకున్నప్పటికీ పిల్లలను కావడానికి ఇష్ట పడటం  లేదు  సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనివ్వాలి అని అనుకుంటున్నారు  ఇలాంటి ఆలోచన విధానం ఏమాత్రం మంచిది కాదు అంటూ కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ వ్యాఖ్యలు చేయగా మంత్రి వ్యాఖ్యలపై ప్రస్తుతం మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. మహిళలను కించపరిచే విధంగా  మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయి అంటూ విమర్శలు  చేస్తున్నారు.  వెంటనే మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: