రేవంత్ బిజెపి కోవర్ట్.. డబ్బులు తీసుకునే బ్రోకర్!

Veldandi Saikiran
హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక తేదీ తరుముకొస్తున్న తరుణంలో... ప్రధాన పార్టీలన్నీ ఆ నియోజకవర్గంలోనే మకాం వేశాయి. హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు మరో 20 రోజులు మాత్రమే ఉండటంతో... గ్రామ స్థాయిలో... ప్రచారం చేస్తున్నాయి అన్ని పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరొకరు మాటల తూటాలు పేల్చి కుంటున్నారు నాయకులు. మేం  గెలిస్తే అభివృద్ధి చేస్తాం అంటూ ప్రజలకు తెగ హామీలు ఇస్తున్నారు. అలాగే నేతలపై... దుమ్మెత్తిపోస్తున్నారు నాయకులు. ఈ నేపథ్యంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రె డ్డి పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు టిఆర్ఎస్ పార్టీ యంగ్ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి. 
భారతీయ జనతా పార్టీకి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కోవర్టుల పనిచేస్తున్నాడని... డబ్బులు తీసుకునే బ్రోకర్ అంటూ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు టిఆర్ఎస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉండి..  మీడియా ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజూరాబాద్ నియోజకవర్గం లో గెలుస్తాడని ఎలా చెబుతారని నిలదీశారు కౌశిక్ రెడ్డి. తాను త్వరలోనే ఎమ్మెల్సీ పదవి చేపడుతున్నామని.. అలాగే హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతామని కుండబద్దలు కొట్టారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డిపాజిట్లు గల్లంతు కాకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా నని రేవంత్ రెడ్డి  కి సవా ల్ విసిరారు పాడి కౌశి క్ రెడ్డి. అసలు రేవం త్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి అదృ ష్టం కలిసి వస్తుం దో లేక అదృష్టం వెంటాడుతుం ది ఎద్దేవా చేశారు పాడి కౌశిక్ రెడ్డి. కాగా హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఈ నెల 30వ తేదీన జరగనుండగా నవంబర్ 3వ తేదీన ఫలితాలు బయట పడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: