
సొంత జిల్లాలో జగన్ ఆ ఇద్దరిని మంత్రులను చేస్తారా ?
జగన్ సైతం తన సొంత జిల్లాకు బాగానే పనులు కూడా చేసి పెడతారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే జిల్లాకు అన్ని అంశాల్లో ప్రాధాన్యత ఇస్తారు. ఇక త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా జగన్...జిల్లాకు ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జగన్ క్యాబినెట్‌లో కడప జిల్లాకు చెంది అంజాద్ బాషాకు ఛాన్స్ ఇచ్చారు. అంజాద్ బాషా డిప్యూటీ సిఎంగా ఉన్నారు.
అయితే నెక్స్ట్ ఎలాగో జగన్...అందరినీ మార్చేయాలని అనుకుంటున్నారు. దీంతో అంజాద్ బాషా పదవి కోల్పోనున్నారు. ఇక జిల్లాలో అంజాద్ బాషా సైడ్ అయితే...ఆయన ప్లేస్‌లో ఎవరిని తీసుకుంటారనేది చర్చనీయాంశమైంది. కడప జిల్లా నుంచి ఈ సారి ఇద్దరినీ క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఎలాగో మంత్రి పదవి కోసం శ్రీకాంత్ రెడ్డి గట్టిగానే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉన్నారు. ఒకవేళ విప్ పదవి వేరే వాళ్ళకు ఇస్తే శ్రీకాంత్‌ని క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు.
అదే సమయంలో రైల్వేకోడూరు ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. మొదట విడతలోనే ఈయనకు మంత్రి పదవి రావాల్సింది. అలాగే పదవి ఇస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో సామాజికవర్గాల సమీకరణాల నేపథ్యంలో శ్రీనివాసులకు పదవి మిస్ అయింది. అయితే ఈ సారి ఖచ్చితంగా కోరుముట్లకు పదవి దక్కవచ్చని తెలుస్తోంది. మరి చూడాలి సొంత జిల్లాలో జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో?