కెసిఆర్ సర్కార్ పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ ది నాలుక నా ? లేక తాటి మట్టనా ? అని నిప్పులు చెరిగారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను అని ఎన్నికల సమయంలో, అసంబ్లీ లో చెప్పినా కేసీఆర్ ఇప్పుడు నేను అనలేదు అంటున్నారని ఫైర్ అయ్యారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. టి ఆర్ ఎస్ కు హుజురాబాద్ ఎన్నికలో ప్రజలు బుద్ది చెప్పాలని కోరారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను హుజురాబాద్ ఎన్నికలో గెల్పించాలని.. రైతులు వరియెస్తే ఉరేసుకున్నట్టే నా నీకు నీ మంత్రులకు రైతన్నలు ఉరేస్తారని హెచ్చరించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
కేసీఆర్ దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను అని అనలేదు అంటున్నారు....దళితులకు కేసీఆర్ 10 లక్షలు ఇస్తారు అంటే నమ్ముతారా ? అని నిలదీశారు. మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదని.. నేను భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఓ గ్రామంలో 20 లక్షల పనులు చెపిస్తాను అని హామీ ఇచ్చానన్నారు. ఇప్పుడు ప్రజలు ఆ పనుల గురించి నన్ను అడిగారని.. ఎంపీ ఫండ్స్ రావడం లేదని చెప్పానని వెల్లడించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.
మీరు మాట ఇచ్చారు పనులు చేయాలి ఎంపీ ఫండ్స్ రాకపోతే మేము ఏమి చేయాలి సర్ అని నన్ను అన్నారని పేర్కొన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తాను సొంత నిధులతో నైనా పనులు చెపిస్తాను అని చెప్పానని.. నాయకుడు అంటే మాట ఇస్తే తప్ప కూడదని సిఎం కెసిఆర్ కు చురకలు అంటించారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రజలు బాగుపడుతారని సోనియాగాంధీ రాష్ట్రం ఇచ్చిందని.. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నుండి ఆదాయం వస్తే సీమాంధ్ర ముఖ్యమంత్రులు నిధులను అక్కడికి తరలించారని పేర్కొన్నారు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.