జగన్ కీలక నిర్ణయం.. సమాచారం ఇవ్వండి.. లక్ష గెలుచుకోండి?
ఈ క్రమంలోనే ప్రస్తుతం దాదాపు అన్ని ఆసుపత్రుల్లో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరం. ఒకవేళ లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఎవరైనా కోరిన.. డబ్బులు ఇస్తామని ఆశ చూపినా.. ఇక అటు డాక్టర్లు కూడా లింగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధం అయిన కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే నేటి రోజుల్లో లింగ వివక్షత అన్నది ఆగిపోయింది. ఆడ, మగ అనే తేడా చూడటం లేదు కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం ఇప్పటికీ జనాల తీరులో మార్పు రాలేదు. అందుకే ఇక రహస్యంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసుకుంటున్న ఘటనలు కూడా అక్కడక్కడా వెలుగులోకి వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్ష చట్టవ్యతిరేకమైన నేపథ్యంలో.. చట్టాన్ని అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాల ఆట కట్టించడానికి సిద్ధమైంది జగన్ సర్కార్. ఇలా చట్ట వ్యతిరేకంగా లింగనిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాల సమాచారం ఇచ్చిన వారి ఏకంగా నగదు ప్రోత్సాహకం అందించేందుకు కూడా సిద్ధమైనట్లు ఇటీవలే రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ఇలా చట్ట వ్యతిరేకంగా లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు సమాచారం ఇస్తే 25 వేల రూపాయల నగదు ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. కోర్టులో శిక్ష ఖరారు అయితే లక్ష రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. 104 నెంబర్ కి.. లేదా pcpndt. Ap. Govt.in వెబ్సైట్ ద్వారా కూడా సమాచారం ఇవ్వవచ్చు తెలిపారు.