ఏపీ ఉద్యోగ సంఘాల నేతల డబుల్‌ గేమ్..? లైవ్‌లో దొరికేశారు..?

Chakravarthi Kalyan
ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి నిన్న అల్టిమేటమ్ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే.. పోరాటానికి సిద్ధమన్నారు. ఏకంగా ప్రభుత్వానికే వార్నింగ్ ఇచ్చారు. అయితే.. అదే నేతలు.. అదే వేదికపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒక్క ఫోన్ వచ్చేసరికి గజగజ వణికిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఓ న్యూస్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆ సందేశం ఇదిగో..  

ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులారా!
5ఏళ్ల కిందట విడిపోయిన ఉద్యోగ జేఏసీలు రెండూ మళ్ళీ మన సమస్యలపై ఏకమయ్యాయని సంతోషపెట్టింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పై పోరాటం అంటూ ఉద్యోగ జేఏసీ ప్రతినిధుల మీడియా సమావేశం మొదలైనది.

ఒక నాయకుడి ఫోన్  మోగింది ..
ఫోన్ జేబులొంచి తీసి ఎంతో అణుకువగా
సార్ సార్...
నమస్తే సార్ అంటూ...
అవతలి నుంచి వాయిస్(?)
....
సార్...సర్...సర్..
...ఏమి లేదు ..లే..
నాయకుడి మొహంలో రంగులు మారాయి...

"కంట్రోల్ లో ...
"ఉంటాం ఉంటాం...కంటోల్ లో ఉంటాం సార్"
...
"ఐనాకూడా మేము సంయమనం చేస్తాం గానీ"..
"గవర్నమెంట్ కు ఆంటీ గా ..ఏమి లేదు సార్"
సార్ ....
సార్...
అదేం ఉండదు సార్..
ఇదిగో ఈడనే ఉన్నాడు బొప్పారాజు పక్కనే ఉన్నాడు మాట్లాడండి సార్"
అంటూ..ఫోన్ అందించాడు...
"ఎవరు" అంటుంటే ...
సజ్జల ...సజ్జల అని నెమ్మదిగా చెప్పడంతో వారూ ఫోన్ తీసుకున్నారు.

ఇది ప్రెస్ రికార్డ్ చేసింది...

నాయకుల తెర వెనుకటి అంతరంగం వేరు ...
ఇలా తెర ముందు దొరికిపోవడం ఇబ్బందే మరి...

ఉద్యోగలోకం యావత్తుకు తెలుసు వీరి అపవిత్ర కలయిక...
బొప్పరాజు ఉద్యోగులందరికి క్షమాపణలు చెప్పి మళ్ళీ పాత జేఏసీలో కలిసిపోతే అభ్యంతరం ఉండదు, పైగా అది మంచి పరిణామం అనొచ్చు.

ఒకవైపు ప్రభుత్వానికి అల్టిమేటం అని ప్రెస్ ముందు చెప్పారు.. కానీ ప్రభుత్వ పెద్దలతో మీకు వ్యతిరేకం కాదు కంట్రోల్ లో ఉంటాము అన్నారు
ఎవరిని మోసం చేయడానికి మళ్లీ ఈ దొంగ నాటకాలు? ఉద్యోగులు గమనిస్తున్నారు.

ఇదీ ఆ సందేశం..ఇలాంటి విషయాల్లో నాయకులు జాగ్రత్తగా ఉండకపోతే.. ఇలాగే దొరికిపోతారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: