గుంటూరులో టీడీపీకి భలే ఛాన్స్...వైసీపీకి దెబ్బపడుతుందా?
తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, తెనాలి, గుంటూరు ఈస్ట్ సీట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి...అటు గుంటూరు వెస్ట్ టిడిపి గెలుచుకుంది. తర్వాత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే సైతం వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో గుంటూరు పార్లమెంట్‌లో వైసీపీ ఆధిక్యం సాధించింది. అయితే గుంటూరు ఎంపీ మాత్రం టిడిపి ఖాతాలోనే ఉంది.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరులో వైసీపీ హవా స్పష్టంగా నడుస్తోంది. పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో వైసీపీదే ఆధిక్యం. వన్ సైడ్‌గా వైసీపీనే గెలిచింది. అయితే ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. కేవలం అధికారంలో ఉండటం....అధికార బలం ఉండటంతోనే లోకల్ పోరులో వైసీపీనే గెలిచిందని చెప్పొచ్చు.
కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్తితి అలా లేదు. ఇక్కడ చాలా వరకు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి. పైగా ఎక్కడకక్కడ టిడిపి నేతలు పుంజుకుంటున్నారు. అన్నిటికంటే రాజధాని అమరావతి అంశం....ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎన్నికల్లో ఇదే అంశం వైసీపీకి పెద్ద డ్యామేజ్ చేసేలా ఉంది.
దాదాపు పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్నీ నియోజకవర్గాలపై రాజధాని ప్రభావం ఉందని చెప్పొచ్చు. స్థానిక ఎన్నికలు కాబట్టి మళ్ళీ వైసీపీని కాకుండా వేరే పార్టీని గెలిపిస్తే ఇబ్బంది అని చెప్పి, ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపారని తెలుస్తోంది. కానీ లోలోపల మాత్రం రాజధాని విషయంలో ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందే అని చెప్పొచ్చు. అదే టిడిపి నేతలకు లక్కీ ఛాన్స్ కానుంది.