తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకగా అందిస్తున్నటువంటి బతుకమ్మ చీరల పై కొన్నిచోట్ల వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో చీరల విషయంలో గందరగోళం నెలకొంటుంది. కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలపై విరుచుకు పడుతున్నారు. చీరలు అడిగిన మహిళలపై దుర్గా ప్రవర్తిస్తున్న గతంలో కూడా చోటుచేసుకుంటున్నాయి. బతుకమ్మ పండగకు ముందే ప్రతి గ్రామంలో కి ప్రభుత్వం అందజేస్తున్న అటువంటి బతుకమ్మ చీరలు ఇప్పటికే వచ్చి ఉన్నాయి. చాలా గ్రామాలలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఆయా చీరలను మహిళలకు అందజేస్తున్నారు. అయితే ఇలా అందజేసే క్రమంలో చీరల విషయంలో పలువురు మహిళల మధ్య మరియు నాయకులకు మధ్య ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి. దీంతో చీరల పంపిణీ కార్యక్రమంలో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పవచ్చు. అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది..? అసలు ఏం జరిగిందో తెలుసుకుందామా..? మీకు ఇష్టం ఉంటేనే ఓటేయండి లేకుంటే లేదు అని కరాఖండిగా ఏ లీడర్ అయినా అంటారా, అసలే అనరు. మీదికెల్లి బతిమిలాడతారు కాళ్లు మొక్కుతారు.
మీకు ఏది కావాలన్నా చేస్తామని బుజ్జగిస్తరు. అడగకుండా పైసలిస్తారు. కానీ అదే లీడర్ గెలిచాక మనం పోతే చాలా బిజీలో ఉంటారు. బతుకమ్మ చీరలు పంచడం జోరుగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరి ఇలాకాలో వాళ్లు పంచుతున్నారు. అయితే వనపర్తి జిల్లా సంకిరెడ్డి పల్లి లోని ప్రజలు కొంచెం మంచి చీరలు ఇస్తే ఏమవుతుంది అని అడిగితే ఎంపీపీ మేడంగారు మహిళలను ఇష్టమున్నట్టు నీకు నచ్చితే తీసుకెళ్లండి లేకపోతే వెళ్ళిపొండి అని అన్నారు. ఆ మాటలతో ఒక్కడి మహిళలంతా కోపంతో అక్కడి నుండి వెళ్లిపోయారు. ఇంకా కొన్ని ఊర్లలో కూడా ఇలానే జరగడంతో మంత్రి గంగుల కమలాకర్ ఇది ఆడబిడ్డ కట్నం అని దీన్ని వెలకట్టద్దని అన్న పెట్టిన చీర ఎలా ఉన్నా అది మా అన్న పెట్టడాని భావించుకొని అది ఎలా ఉన్నా తీసుకోవాలని అన్నారు.