పండగ పూట.. ధరల మంట.. సామాన్యులకేనా తంటా..!

MOHAN BABU
ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టు తయారయింది ఇప్పటికే దేశ ప్రజల పరిస్థితి. ఒకటి తర్వాత ఒకటి ఒకదానికి మించి మరొకటి ఇలా ప్రతిరోజు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దుకాణం పోయి సరుకులు కొందామంటే భగ్గుమంటున్నాయి. ఎలాగొలా కష్టపడి కొనుక్కోచ్చాం కదా వాటిని ఉడికిద్దామంటే గ్యాస్ ధరలు అదే స్థాయిలో భగ్గుమంటున్నాయి. రెండు నెలల గ్యాప్ లో నాలుగు సార్లు ధరలు పెంచేశారు. పండగ పూట వంటింట్లో మంట మొదలైనట్లే. అసలే పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర వస్తువులతో ఇబ్బంది పెడుతున్న సామాన్యుడి సగటు బడ్జెట్ ఇది మరో భారంగా మారుతుంది.

మరి ఈ బాధలు ఎన్నాళ్ళు కట్టెల పొయ్యి కష్టం తప్పుతుందని గ్యాస్ పొయ్యి కి అలవాటు పడితే మళ్లీ ఆ కట్టెలపొయ్యి ఉపయోగించే రోజులు వస్తాయా? రాబోయే రోజుల్లో ధరలు చుక్కలు తాగుబోతు ఉన్నాయా..? వీటికి ఆకాశమే హద్దు ఆపే వారే లేరా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు సామాన్యుల్లో వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడంతో వంట గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు దేశీయ చమురు రంగ మార్కెటింగ్ పరిశ్రమలు వెల్లడించాయి. సబ్సిడీ, సబ్సిడీయేతారా ఎల్పిజి సిలిండర్ ధరలు 15 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో  14.3 కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర 899.50 పైసలకు చేరుకుంది. రెండు నెలల కాలంలో వంటగ్యాస్ ధరలు పెంచడం  నాలుగోసారి. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన 15వ తేదీన గ్యాస్ ధరల పై చమురు సమస్యలు రివ్యూ చేస్తాయి. అక్టోబర్ 1న కమర్షియల్ సిలిండర్ ధరలు పెంచగా కాస్త ఆలస్యంగా ఇప్పుడు వంట గ్యాస్ ధరలను సవరించాయి. సబ్సిడీ కింద లభించే సిలిండర్ ధర మీద ఈ ఇయర్ జనవరి నుంచి ఇప్పటి వరకు రెండు వందల ఐదు రూపాయలు పెరిగింది. సరిగ్గా  పండుగకు ముందు సామాన్యుడిపై చమురు కంపెనీలు మరో భారం వేశాయి.

గ్యాస్ సిలిండర్ తో పాటు పెట్రోల్, డీజిల్ రేట్లకు కూడా రెక్కలు వస్తున్నాయి. అసలే కరోనా పరిణామాల వేళ బతుకు భారంగా మారుతుందంటే ధరల రూపంలో మరిన్ని భారాలు వచ్చి పడుతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. వరుసగా ధరలు పెరుగుతున్న వేళ సామాన్యుల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ధరలు ఇలా మళ్ళీ పోవడానికి కారణం ఏంటి..? రాబోయే రోజుల్లో మరింత మంట ఖాయమా? అంతర్జాతీయ పరిణామాలే ధరల పెరుగుదలకు కారణమా? పడబోయే భారానికి ప్రిపేరై ఉండటమే మార్గమా? పెట్రో ధరల పెరుగుదల తో ఏ రంగంపై ప్రభావం పడనుంది? ఇప్పుడు సామాన్యుల్లో ఇలాంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: