ఆ నియోజకవర్గంపై పవన్ టార్గెట్..? అందుకేనా ఆ ఆరోపణలు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ హాట్ గా సాగుతున్నాయి. వైఎస్ఆర్ సీపీ నేతలు.. జనసేన పార్టీ మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే నటుడు పోసాని కృష్ణమురళి, మంత్రి పేర్ని నాన్ని ఇప్పటికే హాట్ కామెంట్స్ చేశారు. దీంతో జనసేన నేతలు, కార్యకర్తల్లో గ్రహం కట్టలు తెంచుకుంటోంది. వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో మాటల తుటాలు పేల్చుతున్నారు. అటు వైసీపీ వర్గం సైతం అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. ఇదంతా చూస్తుంటే అసలు ఏం జరుగుతుందో ప్రజలకు అర్థం కావడం లేదు. రాజకీయ సమీకరణాలు ఎటువైపు దారితీస్థాయేనని అంతా మాట్లాడుకుంటున్నారు. దీంతో ఏపీ పాలిటిక్స్ లో జనసేనకు కాస్త బలం పుంజుకునే అవకాశాలున్నాయని కొందరు భావిస్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారం కొత్త చర్చకు అద్దం పడుతోంది.
ఏపీ మంత్రి పేర్నినాని టార్గెట్ గా.. పవన్ కళ్యాణ్ చెలరేగిపోయారు. దీంతో జనసేనాని దృష్టంతా మంత్రి పేర్నినాని నియోజక వర్గంపైనే ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఆయన ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయంటూ ప్రచారం జోరందుకుంది. ఎందుకంటే అక్కడ కాపులకు సంబంధించిన ఓటు బ్యాంకు బలంగా ఉందట. అందుకే ఆ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
పేర్ని నాని సైతం కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో.. ఆయన్నే టార్గెట్ గా చేసుకొని పైచేయి సాధించాలని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి గెలిచేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఒకవేళ పవన్ కళ్యాణ్ మచిలీపట్నం నుంచి బరిలోకి దిగితే... ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ బలం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వైపీపీ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చినట్టు అవుతుందని పవన్ పార్టీ యోచనగా తెలుస్తోంది.
ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్... గాజువాక, భీమవరమే కాకుండా.. మచిలీపట్నం నుంచి కూడా బరిలోకి దిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అటు ఏపీ మంత్రి పేర్ని నాని సైతం పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన జనసేనాని ఎన్నికల్లో గెలవడం ద్వారా కసి తీర్చుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.