పవన్ మేటర్ : కరోనా సమయంలో ఎవరెటు?

RATNA KISHORE
పవన్ ను తిట్టేవారంతా, సంబంధిత వివాదాలపై మాట్లాడే వారంతా ఆ రోజు ఏమయిపోయారు. కరోనా రెండేళ్లుగా పీడిస్తోంది. ఇదే సమయంలో తినడానికి తిండి కూడా లేని వారు ఎందరో! ఆ మాటకు వస్తే ఆత్మహత్యలకు సిద్ధం అయిన వారు ఎందరో! అప్పుడు జగన్ ప్రభుత్వానికి థియేటర్ సిబ్బంది గుర్తుకు రాకపోవడం విడ్డూరం. అయినా అందరిలానే తాము అనుకుని కలో,గంజో తాగి బతికారు. గతి లేకపోయినా కుటుంబాలను పోషించుకోలేకపోయినా ఉన్నంతలో శక్తిని కూడదీసుకుని కాలానికి ఎదురేగి వెళ్లారు.


అప్పుడు పవన్ కానీ మరొకరు కానీ కొన్ని కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకున్నారు. చిరు నేతృత్వంలో హైద్రాబాద్లో ఉన్న చిత్ర పరిశ్రమకు చెందిన కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరకులు ఇచ్చారు. మూడు నెలల పాటు వరుసగా సాయం చేశారు. జిల్లాలలో కూడా పవన్ అభిమానులు స్పందించారు. వారితో పాటు ఇంకొందరు దాతలు స్పందించి థియేటర్ సిబ్బందిని ఆదుకున్నారు.


కరోనా సమయంలో తిండికి లేక చాలా మంది అవస్థలు పడ్డారు. అప్పుడు కూడా చిత్ర సీమలో ఎన్నో సమస్యలు వెన్నాడాయి. ఇదే థియేటర్ సిబ్బంది తమకు తిండి లేక, ఆర్థికంగా సరైన రాబడిలేక కుటుంబాలను పస్తులు ఉంచారు. అప్పుడు కూడా ఏపీ సర్కారు ప్రకటించిన సాయం ఏమీ లేదు. ఆ సందర్భంలో కూడా థియేటర్లకు అందించిన తోడ్పాటు ఏమీ లేదు. వాళ్లు అడిగిన మేరకు, అడిగినంత కరెంట్ ఛార్జీల వెసులుబాటు కూడా లేదు. దీంతో్ వీరంతా అనేక అవస్థలు పడి గేట్ మేన్ మొదలుకుని థియేటర్ మేనేజర్ దాకా, కొన్ని చోట్ల థియేటర్ల యజమానులు కూడా జీతాలు ఇవ్వలేక సతమతం అయ్యారు. థియేటర్లు మూయలేక, నడపలేక సంక్షోభాన్ని చవి చూశారు. ఇలాంటి సందర్భాల్లో కూడా జగన్ ప్రభుత్వం వారిని ఆదుకున్నది లేదు. సాయం చేసిందిలేదు. కొన్ని అభిమాన సంఘాలు మాత్రమే మేమున్నాం అని ముందుకు వచ్చాయి. కాస్తో కూస్తో నెలసరి సరకులు, వీలున్నంత వరకూ ఆర్థిక సాయం చేశాయి. అప్పుడు వైసీపీ వర్గాలు ఎక్కడున్నాయో తెలియదు. ఆ రోజు జగన్ సర్కారు వారికి ఏం  సాయం చేసిందో కూడా తెలియదు. కానీ ఇప్పుడు థియేటర్లపై ప్రేమ చూపిస్తున్నారు. థియేటర్ల బాగు కోసం, థియేటర్ల మనుగడ కోసం ఏనాడూ ఏ సాయం చేయని వారు పాలక పక్షం తరఫునే మాట్లాడుతున్నారు. అదే విడ్డూరం. విచిత్రం కూడా!

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: