విజయనగరం : జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి బొత్స సత్య నారాయణ. మేం సన్యా సులమైతే ఆయన రుషి పుంగవుడా.? అని పవన్ కళ్యాణ్ కు చురకలు అంటించారు. మాకు తాట తీస్తాడా..అయితే చూసుకుందామని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్య నారాయణ. టికెట్లు ఆన్ లైన్ విధానం పై సినీ పెద్దలందరూ అంగీకరించారని.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్చ ఇచ్చింది కదా అని చెలరేగిపోతే ... ఎలా కట్టడి చేయాలో మాకూ తెలుసని హెచ్చరించారు మంత్రి బొత్స సత్య నారాయణ.. సినీ పరిశ్రమ అంటే పవన్ కళ్యాణ్ ఒక్కరేనా. ? అని ప్రశ్నించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం లో చేర్పులు, మార్పులు, కూర్పులు ఉంటే అది పూర్తి గా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇష్టం పై ఆధారిపడి ఉంటుందన్నారు మంత్రి బొత్స సత్య నారాయణ. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయానికి మేమంతా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్య నారాయణ. గులాబ్ తుఫాన్ తీవ్రతపై ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని పేర్కొన్నారు మంత్రి బొత్స సత్య నారాయణ.. ఇక అటు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా నిప్పులు చెరిగారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి , మంత్రుల పై చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ వెనక్కి తీసుకోని.. క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఆయన మానశిక స్థితిపై అనుమానం కలుగుతోందని.. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా పలుచనైపోతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి అవంతి శ్రీనివాస్. సినిమా వేదికను రాజకీయ వేదికగా మార్చారని మండిపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్... పవన్ కళ్యాణ్ రాష్ట్రం లోనే, ఉండరు.... ఆయన సినిమాలన్నీ ఫారెన్ లోనే తీస్తారు.. ఏపీ లో ఎందుకు తీయరని నిలదీశారు మంత్రి అవంతి శ్రీనివాస్. పెద్దలు చిరంజీవి, మోహన్ బాబు పై కూడా పవన్ మాట్లాడిన తీరు సరైంది కాదని మండిపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్.