రేప్ కేసు నిందితుడు.. మహిళల బట్టలు ఉతకాలి.. కోర్టు ఆదేశం?

praveen
స్వతంత్ర భారతావనిలో  మహిళకు స్వాతంత్రమే లేకుండా పోయింది. మహిళా స్వేచ్ఛ గా అర్ధరాత్రి ఎలాంటి భయం లేకుండా నడిరోడ్డుపై తిరిగినప్పుడే  దేశానికి అసలు సిసలైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు మహానుభావుడు గాంధీజీ.  కానీ ప్రాణ త్యాగాల తర్వాత సాధించిపెట్టిన ఈ స్వతంత్ర భారతంలో మహిళ అర్ధరాత్రి కాదు కదా పట్టపగలు కూడా ఒంటరిగా రోడ్డుపై నడవలేని పరిస్థితి నెలకొంది.  నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే ఒంటరిగానే కాదు కుటుంబ సభ్యులు పక్కనే ఉన్న కూడా మహిళలకు రక్షణ లేదు అన్నది అర్ధమవుతుంది.

 కామంతో కళ్లు మూసుకుపోయి మానవత్వం అనేది మర్చిపోయి మానవ మృగాలుగా మారుతున్న వారు రోజురోజుకీ ఆడపిల్లల కనిపిస్తే చాలు అత్యాచారాలకు పాల్పడుతున్నారు. మరికొంతమంది అంతటితో ఆగకుండా దారుణంగా ప్రాణాలు తీస్తూ ఎంతో మంది యువతుల ఉసురు పోసుకుంటున్నారు.  అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఎక్కడా కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు. రోజురోజుకీ ఆడపిల్లల పై జరుగుతున్న అత్యాచార ఘటనలకు పెరుగుతున్నాయే తప్ప ఎక్కడా తగ్గడం లేదు.  దీంతో మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారిపోతోంది.

 పిల్లల పై అత్యాచారం చేసిన నిందితులకు కిందిస్థాయి కోర్టులు ఉరి శిక్షలు విధించినప్పటికీ ఇక ఆ తీర్పును సవాల్ చేస్తూ పై స్థాయికి కోర్టుకు వెళ్లడం అక్కడ శిక్ష పడితే మరో కోర్టుకు వెళ్లడం లాంటివి చేస్తున్నారు నిందితులు. ఇకపోతే ఇటీవలే రేప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి బీహార్లో ఒక వింత పనిష్మెంట్ ఇచ్చింది కోర్టు. బెయిల్ మంజూరు చేయాలని నిందితుడు కోరిగా బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్న కోర్టు.. ఆరు నెలలపాటు గ్రామంలోని మహిళలు బట్టలు ఉచితంగా ఉతికి ఇస్త్రీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మధుబని జిల్లా లో లలన్ అనే లాండ్రీ షాపు నడిపే వ్యక్తి రేప్ కేసులో జైలు కెళ్లాడు. బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించగా.. అతను బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. అతనిపై పాత కేసులు ఏమీ లేకపోవడంతో ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చి బెయిల్ మంజూరు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: