సీతాఫలం కోసం.. పొరుగు దేశంతో గొడవ పెట్టుకున్న చైనా?

praveen
చైనా ఎప్పుడూ ప్రతి విషయంలో కూడా వక్రబుద్ధి చూపిస్తూ పొరుగు దేశాలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది.  మొదట పొరుగు దేశం లోని భూభాగాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే అది కుదరనప్పుడు ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురి చేసి లొంగదీసుకోవడానికి పన్నాగం పన్నుతోంది.  ఇలా ఇప్పటికే సరిహద్దు దేశాలు అన్నింటితో కూడా డ్రాగన్ దేశం వివాదాలు పెట్టుకుంది అన్న విషయం తెలిసిందే.  అదే సమయంలో ఎన్నో ఏళ్ల నుంచి చైనా పొరుగు దేశమైన  తైవాన్ తమ దేశంలో భూభాగం అంటూ  చెప్పుకుంటుంది. కానీ తాము ఏ దేశంలో కలవలేదని.. తమది ప్రత్యేక దేశం అంటూ అటు తైవాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చైనా స్టేట్మెంట్లను ఖండిస్తూనే ఉంది.

 ఈ క్రమంలోనే తైవాన్ ను ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకుని తమ దేశంలో కలుపుకోవాలని భావిస్తున్న చైనా..  దీని కోసం ఎన్నో కుయుక్తులు పన్నుతోంది.  అటు తైవాన్ దేశాన్ని రకరకాల ఇబ్బందులు పెడుతూ  లొంగదీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే తైవాన్కు ఆహారధాన్యాల ఎగుమతులను నిలిపి వేసి అక్కడ ఆహారధాన్యాల కొరత ఏర్పడే విధంగా చేసింది చైనా.  ఇక చైనా కుట్రతో అటు తైవాన్లో రోజురోజుకు ఆహారధాన్యాల కొరత పెరిగిపోతూనే ఉంది.  ఇక ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను ఉల్లంఘించి మరీ ఇలా ఆహార ధాన్యాలను ఎగుమతి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది చైనా.

 ఇక ఇప్పుడు చిన్న దేశమైన తైవాన్ తో మరో వివాదానికి తెరలేపింది. తైవాన్ నుంచి అటు చైనా రెండు రకాల పండ్లు దిగుమతులు అవుతూ ఉంటాయి. సీతాఫలం, వాక్స్ యాపిల్ పండ్లు దిగుమతి అవుతూ ఉండగా.. ఇటీవల వీటి దిగుమతులను నిలిపివేస్తూ చైనా తైవాన్ కు షాకిచ్చింది. ప్రమాదకర సూక్ష్మ జీవులు ఉన్నాయి అంటూ ఆరోపించిన చైనా ఈ రెండు రకాల పండ్ల దిగుమతులను నిలిపివేస్తామని హెచ్చరించింది. వెంటనే ఇక ఈ దిగుమతులను ఆపేయాలి అంటూ చైనా కస్టమ్స్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే దీనిపై స్పందించిన తైవాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయ కారణాలు వెల్లడించకుండా ఏకపక్షంగా చైనా వాధిస్తోంది అంటూ  చెబుతుంది. ఈ నెల 30 లోగా తమకు దీనిపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వక పోతే తాము ప్రపంచ వాణిజ్య సంస్థకు ఫిర్యాదు చేస్తాం అంటూ చైనాను హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: