అచ్చెన్న కాన్ఫిడెన్స్ ఏంటి?
కానీ ఇలా వరుసగా దారుణమైన ఓటములు వచ్చినా సరే అచ్చెన్న దూకుడు తగ్గలేదు. ఓటమిని ఒప్పుకోకుండా దమ్ముంటే...జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు రావాలని సవాల్ విసురుతున్నారు. అంటే స్థానికంలో గెలవాలని పార్టీ సాధారణ ఎన్నికల్లో ఎలా గెలుస్తుందని అచ్చెన్న అనుకుంటున్నారో అర్ధం కాకుండా ఉంది. అసలు టిడిపి గెలుపుపై ఆయనకు ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటనేది ఎవరికీ అర్ధం కాకుండా ఉంది.
తాజాగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టిడిపి మాజీ జెడ్పిటిసి ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి, వారి వాహనాలకు నిప్పు పెట్టారు. అలాగే ఇంటిపై రాళ్ళు రువ్వారు. ఈ దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు. అయితే ఈ అంశంపై న్యాయ పరంగా పోరాటం చేయాలి. అలా కాకుండా అచ్చెన్న డైలాగులు వేస్తున్నారు.
నెక్స్ట్ వచ్చేది టిడిపి ప్రభుత్వమే అని, అప్పుడు వైసీపీ వాళ్ళు చంద్ర మండలంలో దాక్కున్న వదిలే ప్రసక్తే లేదని అచ్చెన్న అంటున్నారు. మరి టిడిపి అధికారంలోకి వస్తుందని అచ్చెన్న అంత స్ట్రాంగ్‌గా ఎలా చెప్పేస్తున్నారు. ఇప్పటికే స్థానిక పోరులో దారుణమైన పరాజయాలని చవిచూశారు. అయినా బాగా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి డైలాగులు వేయడం మానేసి...పార్టీ బలోపేతానికి కృషి చేస్తే కొద్దో గొప్పో పార్టీకి బెనిఫిట్ అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.