గుడ్ న్యూస్ చెప్పిన WHO.. పిల్లలకు కరోనా ముప్పు తక్కువే..!

Veldandi Saikiran
చిన్నపిల్లలపై కరోనా ముప్పు ఉండదని క్లారిటీ ఇచ్చింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. చిన్నపిల్లల్లో కరోనా వ్యాప్తి మరియు వారి లో కరోనా మహమ్మారి తీవ్రత... చాలా తక్కువేనని ఇష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.  అయితే అనుకోకుండా కరోనా సోకిన చిన్నపిల్లలకు పెద్ద ముప్పు ఉండబోదని వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇక వరల్డ్ వైడ్ గా నమోదవుతున్న... కరోనా కేసు ల ప్రకారం.... కరుణ బాధితుల్లో 5 సంవత్సరాల లోపు పిల్లలు 1.8 శాతం మాత్రమే ఉన్నారని స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. 

చిన్నపిల్లలను తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని... వారి తేజ్ పెరుగుతున్న  నేపథ్యంలో.... కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తుందని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కరోనా మహమ్మారి బాధితుల్లో  6-14 సంవత్సరాల వయసు వారు... 6.2 శాతం మంది ఉన్నారని తెలిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ....  15-24 సంవత్సరాల మధ్య వయస్సు వారు 15. 3 ఉన్నారని క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు చిన్న పిల్లలలో ... మరణాల శాతం కూడా చాలా తక్కువగా నమోదైనట్లు ప్రకటించింది. 

కరోనా మరణాల విషయానికి వస్తే.... 15 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న వారిలో... 99.8 శాతం మరణాలు సంభవించినట్లు ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే సంవత్సరం లోపు గల చిన్నపిల్లల కరోనా మహమ్మారి వ్యాప్తి చాలా తక్కువగా ఉందని పేర్కొంది. అయితే ఆ చిన్న పిల్లలకు కరోనా మహమ్మారి సోకితే... పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయని హెచ్చరికలు కూడా చేసింది డబ్ల్యూహెచ్ఓ.  ఇందులో 0-28 రోజులలోపు ఉన్న శిశువులలో చాలా జాగ్రత్తగా ఉండాలని.... వారికి కరోనా మహమ్మారి సోకితే... అత్యంత ప్రమాదకరమని హెచ్చరించింది డబ్ల్యూహెచ్ఓ. చిన్న పిల్లల్లో జలుబు మరియు దగ్గు లాంటివి తప్ప కరోనా లక్షణాలు మిగతావి కనిపించడం లేదని పేర్కొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. చిన్నపిల్లలకు కరోనా పరీక్షలు చేయించడం లేదని అందుకే... చిన్నపిల్లల్లో కరుణ కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: