అక్కడ టీడీపీ జెండా కనుమరుగైపోతుందా?
ఇక ఎక్కువసార్లు కాంగ్రెస్ జెండా ఎగిరింది. ఆ తర్వాత వైసీపీ హవా మొదలైంది. ముఖ్యంగా వైసీపీ తరుపున srikanth REDDY' target='_blank' title='గడికోట శ్రీకాంత్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>గడికోట శ్రీకాంత్ రెడ్డి డామినేషన్ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన శ్రీకాంత్, మధ్యలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి జగన్ పెట్టిన వైసీపీలో చేరారు. ఈ క్రమంలో వచ్చిన 2012 ఉపఎన్నికలో శ్రీకాంత్ వైసీపీ తరుపున భారీ మెజారిటీతో గెలిచారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో కూడా శ్రీకాంత్ ఆధిక్యం కొనసాగింది.
ఇలా వరుసపెట్టి గెలుస్తున్న శ్రీకాంత్..రాయచోటిలో పూర్తిగా బలపడ్డారు. అసలు ఇక్కడ ఆయన్ని ఓడించడం టిడిపికి సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. పైగా ఇక్కడ టిడిపికి సరైన నాయకత్వం లేదు. పైగా ఇక్కడ సీనియర్ నేతలు పాలకొండ్రాయుడు, రమేష్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా నడుస్తోంది. గత ఎన్నికల్లో టిడిపి టికెట్ రమేష్ రెడ్డికి ఇవ్వడంతో పాలకొండ్రాయుడు సైడ్ అయ్యారు.
అయితే ఎన్నికల్లో ఓడిపోయాక రమేష్ రెడ్డి కూడా పార్టీలో కనిపించడం మానేశారు. దీంతో నియోజకవర్గంలో పార్టీకి దిక్కు లేకుండా పోయింది. కాకపోతే రమేష్ సోదరుడు శ్రీనివాసులు రెడ్డి రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడుగా పనిచేస్తున్నారు. మరి శ్రీనివాసులు రెడ్డి....నిదానంగా తన సోదరుడుని పార్టీలో యాక్టివ్ చేయొచ్చు. కానీ యాక్టివ్ అయినా సరే రాయచోటిలో టిడిపి జెండా ఎగరడం కష్టమే అని తెలుస్తోంది.