సాయి ధరమ్ ఇష్యూ : తప్పులెన్ను వారు?
బాధ్యత గల మీడియా బాధ్యత తప్పి ఉందని కొందరు యువకులు నిన్నటి వేళ నిరసనలు వ్యక్తం చేశారు. ఆరేళ్ల పాప హత్య మీకు గుడ్డి కళ్లకు కనిపించలేదా అని ప్రశ్నించారు. ఓబీ వ్యాన్ల సాయంతో సాయి ధరమ్ ఇష్యూను నిమిష నిమిషానికీ ప్రసారం చేయాల్సిన అవసరం ఎందుకు అని కూడా ప్రశ్నించారు. దీంతో నిన్నటి వేళ చాలా చర్చే నడిచింది. కుర్రాళ్లు ఆవేశంలో ఉన్నారు అని అనుకోవడానికి లేదు మొత్తం సమాజమే ఇవాళ దరిద్రగొట్టు మీడియాపై విరుచుకుపడుతోంది. నాణ్యత కన్నా వేగం ప్రధానం అన్న కోవలో దరిద్రం అంతా నెత్తిమీద గుమ్మరిస్తోందని మండిపడుతోంది.
ఈ పాటి స్పృహ మీడియాకు లేదా ? ఎందుకు లేదు? ఎప్పుడు వస్తుంది? అంటే దరిద్రగొట్టు ఛానెళ్లను ప్రజలే తమంతట తాము వ్యతిరేకించినప్పుడు. ఇదే సందర్భంలో టీవీ 9 మాత్రం చాలా కలవరపాటుకు గురవుతోంది. తాము చేసిందంతా మంచే అని చెబుతోంది. వీరికి కౌంటర్ గా హరీశ్ శంకర్ ప్రతిస్పందిస్తు న్నారు. సినిమా అయినా మీడియా అయినా సామాజిక బాధ్యతను విస్మరించకూడదు అన్నదే ప్రధాన నినాదం కావాలి. దొంతు రమేశ్ లాంటి టీవీ నైన్ జర్నలిస్టులు, వారి పరివారం హరీశ్ శంకర్ తో వాగ్యుద్దంకు దిగినా ఫలితం ఏమీ ఉండదు కానీ సినిమా ప్ర పంచంలో వికృత పోకడలు ఉన్నాయి అవి కూడా పోవాలి. వికృత పోకడలు సినిమాల్లోనూ ఉన్నాయి..మీడియాల్లోనూ ఉన్నా యి. ఈ రెంండూ పోకుండా పోగొట్టుకోకుండా గొట్టం మీడియాను సినిమా వాళ్లు, సినిమా వాళ్లను గొట్టం మీడియా వాళ్లు తిట్టుకోవ డంలో అర్థం లేదు. తెల్సు కదా తప్పు లెన్ను వారు తమ తప్పులు ఎరుగరు?
సినీ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలోనే పూర్తి స్థాయిలో రికవరీ అవుతాడని శస్త్ర చికిత్స చేసిన నిపుణులు చెబుతున్నారు. ఇదే సందర్భంలో సోషల్ మీ డియా వేదికగానూ, అదేవిధంగా బయట ప్రపంచంలోనూ అనేక వాగ్వాదాలు నడుస్తున్నాయి. సాయి ధరమ్ ఇష్యూ పై ఉన్న శ్రద్ధ ఆరేళ్ల చైత్ర పై లేదా అని ప్రశ్నిస్తున్నారు. చిన్నారి చైత్ర సింగరేణి కాలనీలో దారుణంగా హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మీడియా సరిగా ఫోకస్ చేయలేదని సోషల్ మీడియాలో చాలా మంది తిట్లదండకం అందుకున్నారు. ఇంకొందరు జర్నలిస్టులు మీడియా మద్దతుగా ఇంకొందరు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో నిన్నటి వేళ కొందరు యువకులు సాయి ధరమ్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు పోయి టీవీ 9 అమర్ రహే., ఎన్టీవీ అమర్ రహే, ఏబీఎన్ అమర్ రహే అని నినాదాలు చేశారు. దీంతో అక్కడున్న సెక్యూరిటీ అప్రమత్తమై తగవులు ఎందుకని అక్కడి నుంచి వారిని పంపేశారు. ఈ మొత్తం ఘటనలో తప్పెవరిది? మరోవైపు సోషల్ మీడియాలో దొంతు రమేశ అనే జర్నలిస్టుకు, హరీశ్ శంకర్ అనే డైరెక్టరుకు మధ్య వాగ్వాదం నడిచింది. పబ్లిక్ డొమైన్ లో ఇలాంటి వాగ్వాదాలు ఎన్ని జరిగినా యాజమాన్యాలు మారుతాయి అని అనుకోవడం అవివేకం.