చివరికి 'సారీ' చెప్పిన అచ్చెన్నాయుడు?
ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను అంటూ క్షమాపణ కోరడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ ను గౌరవం లేకుండా అటు టిడిపి ఎమ్మెల్యే అచ్చన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ అటు ఎమ్మెల్యే జోగి రమేష్ అసెంబ్లీ ఫ్రీ విలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయగా ఈ విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అయితే గతంలో కూడా పలుమార్లు ఏపీ స్పీకర్ పై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది అని తెలిసిందే. అయితే ఇక ప్రివిలేజ్ కమిటీ విచారణ తర్వాత గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అచ్చన్నాయుడు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఇక అచ్చన్నాయుడు ఇచ్చిన వివరణను కూడా కమిటీ సభ్యులకు పంపిస్తాను అంటూ చెప్పుకొచ్చారు. కమిటీ సభ్యులు అందరూ అభిప్రాయం తర్వాతనే తదుపరి నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతాము అంటూ చెప్పుకొచ్చారు గోవర్ధన్ రెడ్డి. ఇక అనంతరం మీడియాతో మాట్లాడిన అచ్చన్నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ అంశం కోర్టు లో ఉన్నప్పుడు చంద్రబాబును తమ్మినేని విమర్శించారు. నాకు చట్టం పైన వ్యవస్థల పైన ఎంతో నమ్మకం ఉంది. అలాగే స్పీకర్ స్థానం పైన కూడా గౌరవం ఉంది. ఇక ప్రివిలేజ్ కమిటీ కూడా నేను ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందింది అని భావిస్తున్నాను అంటూ అచ్చన్నాయుడు వ్యాఖ్యానించారు.