నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలి ?

Veldandi Saikiran
గణేష్ నిమజ్జనంపై తీర్పు పై తెలంగాణ హై కోర్టు లో రివ్యూ పిటిషన్ దాఖలయ్యాయి. తీర్పు ను పున పరిశీలించాలని పిటిషన్ దాఖలు చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్.  తీర్పు లో ప్రధానం గా 4 అంశాలు తొలగించాలని కోరిన జీహెచ్ఎంసీ.. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయా ల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనం పై నిషేధం ఎత్తివేయాలని తెలిపింది.  ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనాని కి అనుమతించాలని కోరింది జీహెచ్ఎంసీ. సాగర్ లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని విన్నవించింది జీహెచ్ ఎంసీ.  

హుస్సేన్ సాగర్ లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరిం చాలని కోరింది జీహెచ్ఎంసీ. ట్యాంక్ బండ్ వైపు అనుమ తించక పోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని స్పష్టం చేసింది. వ్యయ ప్రయాసల తో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణాని కి కొంత సమయం అవసరమని తెలిపింది జీహెచ్ఎంసీ.  నగరవ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భా రీ విగ్రహాలు ఉన్నాయని.. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవని తెలిపింది జీహెచ్ఎంసీ.

పెద్ద విగ్రహాలు నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని.. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేసామని వెల్లడించింది జీహెచ్ఎంసీ. నెలల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని.. ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందని స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ. నిమజ్జనం తర్వత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని పేర్కొంది  జీహెచ్ఎంసీ. మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్యపరుస్తామని..విగ్రహాలు ఆపితే వాహనాలు రోడ్లపై నిలిపివేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది  జీహెచ్ఎంసీ.  హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందని పేర్కొంది జీహెచ్ఎం సీ. నిమజ్జన సమయం లో  కరోనా నియమ నిబందనలు పాటిస్తూ.. ప్రక్రియ కొనసాగిస్తామని పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: