తెలంగాణ సర్కారు బడులకు ఫుల్ గిరాకీ..!

ఒకప్పుడు సర్కార్ బడులు అంటే చిన్న చూపు చూసేవారు. కానీ ఇప్పుడు సర్కార్ బడి లకు ఫుల్ గిరాకీ పెరిగింది. గత ఏడాది రాష్ట్రంలో కరోనా కేసులు రావడంతో అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలోనే స్కూల్లు కూడా మూతపడ్డాయి. దాంతో ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసులు ప్రారంభించి విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఫీజులు వసూలు చేశాయి. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆన్లైన్ లో క్లాసులు చెప్పినప్పటికీ ఫీజు లేకపోవడంతో తల్లిదండ్రుల పై ఎలాంటి భారం పడలేదు. కరోనా కారణంగా ఎంతో మంది తల్లిదండ్రులు ఉద్యోగాలు పోగా వ్యాపారాలు చేసే వారు కూడా వ్యాపారం లేక నష్టపోయారు.


దాంతో ప్రైవేట్ స్కుళ్ళ లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక కొన్ని ప్రైవేట్ స్కూల్లు పరీక్ష ఫీజు, ట్యూషన్ ఫీజు ఇతర ఫీజులు అంటూ ఫీజులను వసూలు చేశాయి. ఆ తరవాత పరిస్థితి సాధారణ స్థితికి రాగా పాఠశాలలను ప్రారంభించారు. అయితే మళ్లీ కొద్దిరోజులకే కరోనా కేసులు పెరగడంతో మళ్ళీ స్కూల్లు మూతపడ్డాయి. దాంతో తల్లిదండ్రులు ఫీజులు కట్టాల్సి వచ్చింది. అయితే ఇప్పటికీ కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. అక్కడక్కడా కేసులు నమోదు అవుతున్నాయి. కానీ పాఠశాలను ప్రారంభించారు. ఎప్పుడు కరోనా  విజృంభిస్తుందో మళ్ళీ ఎప్పుడూ స్కూళ్లు మూతపడతాయో తెలియని పరిస్థితి.


దాంతో తల్లిదండ్రులు ఫీజుల భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చదివించాలని నిర్ణయం తీసుకుంటున్నారు. దాంతో తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు ఫుల్ గిరాకీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లలో సీటు దొరకడం కష్టంగా మారింది. దాంతో పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లలో సీట్లు ఇప్పించాలని ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులను కోరుతున్నట్టు తెలుస్తోంది. అలా కరోనా దెబ్బతో తల్లి తండ్రులు ప్రభుత్వ స్కూళ్ల వైపు మల్లగా టీచర్లు తమ బోధనలతో విద్యార్థులను మెప్పిస్తారా లేదా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: