బ్రిక్స్ సమావేశంలో ప్రధాని మోడీ కీలక ప్రకటన..!

NAGARJUNA NAKKA
బ్రిక్స్ సమావేశంలో  ఛైర్మన్ హోదాలో ప్రధాని మోడీ అధ్యక్షత వహించి.. ప్రసంగించారు. ఉగ్రవాద వ్యతిరేక కార్యాచరణ ప్రణాళికకు బ్రిక్ దేశాల ఆమోదం లభించిందన్న ఆయన.. పొరుగుదేశాలకు ముప్పుగా ఆఫ్ఘాన్ మారకుండా చూడాలన్నారు. డ్రగ్స్ రవాణా, ఉగ్రవాదానికి మూలంగా ఆప్ఘాన్ మారకూడదని అభిప్రాయపడ్డారు. 15ఏళ్లుగా బ్రిక్స్ సమావేశాలు సాధించిందనీ.. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల గొంతుకగా బ్రిక్స్ నిలిచిందన్నారు మోడీ.

ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని డ్రాగన్ కంట్రీ స్వాగతిస్తోంది. వారి దేశాలతో పరిస్థితులు చక్కబడతాయని పేర్కొంది. పొరుగునున్న దేశాలతో తాలిబన్లు సత్సంబంధాలు నెలకొల్పుతారని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే ఆఫ్ఘాన్ అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోబోమని చైనా తెలిపింది. మరోవైపు అమెరికా వల్లే ఆప్ఘాన్ లో అస్థిరత ఏర్పడిందనీ... దానికి తాలిబన్లు తెరదించారని కొనియాడింది.

ఇదిలా ఉంటే ఆఫ్ఘానిస్థాన్ లో తమ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిని తాలిబన్ల ప్రభుత్వం హెచ్చరించింది. పౌరులందరూ ఆందోళనలను ఆపేయాలని.. అనుమతి లేకుండా బ్యానర్లను ప్రదర్శించవద్దని స్పష్టం చేసింది. కారణం ఏదైనా సరే ఆందోళన మాత్రం చేపట్టరాదని హుకుం జారీ చేసింది. తాలిబన్ల ప్రభుత్వంలో మహిళలకు చోటివ్వాలనే డిమాండ్ తో నిరసనలు కొనసాగుతున్నాయి. తాలిబన్లు హెచ్చరించినా మహిళలు వెనక్కి తగ్గలేదు.

ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్లకు అధికారం పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. కొందరు తాలిబన్లు ఆప్ఘాన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ క్రాఫ్ట్ రెక్కలకు ఊయల కట్టుకొని ఊగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మరికొందరు అమెరికా వదిలి వెళ్లిన ఫైటర్ జెట్ లలో ఎక్కి చక్కర్లు కొడుతున్నారు. అమెరికా విమానాల, యుద్ధ ట్యాంకులు, కొన్ని రకాల రైఫిల్స్ ను ఆప్ఘాన్ లోనే వదిలి వెళ్లింది. వాటికి రిపేర్లు చేయించి తీసుకెళ్లే బదులు ఈ నిర్ణయం తీసుకుంది.

ఆప్ఘానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు ఎట్టకేలకు అధ్యక్ష పీఠాన్ని అయితే ఎక్కారు. తమ అరాచకాలకు హద్దుల్లేవంటూ నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. వారు విధించిన ఆంక్షలకు అక్కడి పౌరులు విలవిలలాడిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో పొరుగు దేశాలు ఆ దేశం పట్ల ఎలా వ్యవహరిస్తాయో చూడాలి. ఐక్యరాజ్యసమితి ప్రణాళిక ఏంటో మరి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: