థాంక్యూ జ‌గ‌న్ అంటున్న లోకేశ్ !

RATNA KISHORE
ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న‌ప్పుడూ ఇప్పుడూ పోరాటాలే పార్టీల‌కు శ‌ర‌ణ్యం అవుతున్నాయి. కానీ ఈ పోరాటాల ఫ‌లితంగా ఒక‌రు హీరోలు మ‌రొక‌రు జీరోలు


రెడ్డి చెప్పిన విధంగా లోకేశ్ న‌డుచుకుంటున్నాడు. నిరంతరం జ‌నంలో లేక‌పోతే త‌న‌ను మ‌రిచిపోతున్నారన్న భావ‌న ఒక‌టి ఆయ‌న‌లో ఉంది. అదేవిధంగా ఆయ‌న‌ను తరుచూ హీరో చేసేందుకు జ‌గ‌న్ ఎంత‌గానో శ్ర‌మిస్తూ, సీఎంగా త‌న‌కున్న విశేష అధికారాల‌ను వెచ్చిస్తున్నాడు. ఏం లేదు చంద్ర‌బాబు ఏ త‌ప్పులు చేశాడో అవే త‌ప్పులు జ‌గ‌న్ చేసి లోకేశ్ కు సీఎం కుర్చీ ఇస్తాడ‌ని టాక్. తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది.


లోకేశ్ పోరాడుతున్నాడు అనే క‌న్నా అంత‌కుమించి ఏమ‌యినా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. అధికారం కోల్పోయిన త‌రువాత ప్ర‌జ‌ల్లో ఉండేందుకు ఆయ‌న ప‌డుతున్న ఆరాటాన్ని వైసీపీ అర్థం చేసుకోవ‌డం లేదు. ఆ కార‌ణంగా అకార‌ణంగా ఆయ‌న‌ను అడ్డుకుంటుంది అన్న అప‌వాదు ఒక‌టి నెత్తిపై వేసుకుని తిరుగుతోంది. ఏదేమైన‌ప్ప‌టికీ లోకేశ్ కు ఇంకొంత ప‌రిణితి వ‌స్తే జ‌గ‌న్ బాబు లానే చిన‌బాబు కూడా సీఎం కావ‌డంలో ఆశ్చ‌ర్యం లేదు..కానీ టైం రావాలి అంతే!



చాలా రోజుల‌కు జ‌గ‌న్ కు లోకేశ్ థాంక్స్ చెప్పాడు. త‌న‌కు గొప్ప సాయం చేసినందుకు త‌న న‌ర‌సాపురం ప‌ర్య‌ట‌న‌ను విజ‌య‌వంతం చేసినందుకు పోలీసుల‌కు కూడా థాంక్స్ చెప్పాడు.ఇలాంటి ప‌నులు చేయ‌డం వ‌ల్లే పార్టీకీ, త‌న‌కూ మ‌రింత మైలేజ్ పెరుగుతుంద న్న భావ‌న‌లో ఉన్నాడు. గుంటూరులో ఇవాళ త‌నను అడ్డుకున్నంత మాత్రాన రాజ‌కీయం ఏం మారిపోద‌ని, తాను ఎన్న‌డూ త‌ప్పుడు మార్గంలో రాజ‌కీయాలు చేయ‌లేద‌ని అంటూ జ‌గ‌న్ ను టార్గెట్ చేశాడు. గుంటూరు పోలీసులు త‌న‌ని అడ్డుకుని చాలా మంచి సాయం చేశారు అని చెప్ప‌క‌నే చెప్పాడు. ఎందుకంటే గతంలో ఇలానే విప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు జ‌గ‌న్ ను అడ్డుకుని టీడీపీనే ఆయ‌నను హీరో చేసింది క‌నుక. సో హీరోలు ఎవరికి వారు కావాల్సిన ప‌ని లేదు. ఓ నాయ‌కుడి త‌ప్పిదాలే మ‌రో నాయ‌కుడి వ‌రాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap

సంబంధిత వార్తలు: