భార్యకు విడాకులిచ్చిన ఇండియా స్టార్ క్రికెటర్..!

NAGARJUNA NAKKA
ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ వివాహ బంధాన్ని తెగదెంపులు చేసుకున్నాడు. తన భార్య అయేషా ముఖర్జీతో కటీఫ్ చెప్పేశాడు. తొమ్మిదేళ్ల పాటు సజావుగా సాగిన వీరి బంధం విడాకులతో ఎండ్ కార్డ్ పడింది. ఈ దంపతులకు సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శిఖర్ ధావన్ సతీమణి చేసిన భావోద్వేగ పోస్ట్ ను చూసి క్రికెట్ అభిమానులు షాక్ కు గురయ్యారు. తాము విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వెల్లడించారు. కానీ శిఖర్ ధావన్ నుంచి మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు.
టీమిండియా స్టార్ క్రికెటర్ గా వెలుగొందుతున్నశిఖర్ ధావన్...2012లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే శిఖర్ ధావన్, అయేషా వివాహ బంధంలో అడుగుపెట్టి తొమ్మిదేళ్లయింది. వీరి వివాహ బంధానికి గుర్తుగా  2014లో జోరావర్ అనే కొడుకు కూడా ఉన్నాడు. ఇంకో విషయం ఏంటంటే... శిఖర్ ధావన్ కంటే వయసులో అయేషా పదేళ్లు పెద్ద. ధావన్ అయేషాను పెళ్లి చేసుకునే సమయానికి ఆమెకు ఇద్దకు కూతుళ్లు కూడా ఉన్నారు. శిఖర్ ధావన్ పెళ్లి చేసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో శిఖర్ ధావన్ కు అతని తల్లి ఫుల్ సపోర్ట్ కూడా ఇచ్చింది.  
ఎనిమిదేళ్లుగా వీరి సంసార జీవితం అన్యోన్యంగా సాగినా... గత సంవత్సరం నుండి శిఖర్, అయేషా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరి మధ్య వాగ్వాదం కాస్తా.. కొట్టుకునే స్థితికి కూడా వెళ్లిందనే గాసిప్స్ గుప్పుమంటున్నాయి. అంతేకాదు సామాజిక మాద్యమాల్లో ఇద్దరూ.. ఎవరికి వారే యమునా తీరే అనేలా కనిపించారు. ఇటీవల తన ఇన్ స్టా ఖాతా నుంచి శిఖర్ ధావన్ కు సంబంధంచిన విషయాలను అయేషా డిలీట్ చేసింది. కానీ ధావన్ ఇన్ స్టాలో మాత్రం అయేషా ఫోటోలు దర్శనమిస్తున్నాయి.
అయేషా ఈ విడాకుల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. తాను తొలిసారి విడాకులు తీసుకున్నప్పుడు కలిగిన ఫీలింగ్.. ఇప్పుడూ కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. డైవోర్స్ అనే పదం తన జీవితంలో ఒక చెత్త పదంగా అభివర్ణించింది. ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది సోమవారమే అయినా.. అది నెటిజన్ల దృష్టిలో పడటానికి రెండు రోజుల సమయం పట్టింది. ఇక శిఖర్ ధావన్ అయితే ప్రస్తుతం ఐపీఎల్ 2021కోసం యూఏఈ టూర్ లో ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కు సారథిగా ఉన్నాడు. మరి అయేషా ఎమోషనల్ అయి ఇలా చేసిందా.. లేక నిజంగానే వీరు విడాకులు తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: