అపోజిషన్స్ ఎటాకింగ్ మోడ్....జగన్ బయటపడేది ఎలా?
అయితే టిడిపి విమర్శలు వల్ల కావొచ్చు, వైసీపీ తప్పిదాల వల్ల కావొచ్చు...జగన్ ప్రభుత్వానికైతే కాస్త నెగిటివ్ పెరిగింది. ఇక ఇప్పుడు వైసీపీని అన్నీ పార్టీలు టార్గెట్ చేసేశాయి. ఇప్పటివరకు టిడిపినే జగన్ ప్రభుత్వంపై ఎక్కువ ఫైర్ అవుతూ వస్తుంది. ఇప్పుడు జనసేన, బిజేపి, కాంగ్రెస్, వామపక్షాలు సైతం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఓ వైపు రోడ్లు, మద్యం ధరలు, కరెంట్ ఛార్జీలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో పాటు ఇతర అంశాలపై టిడిపి పోరాటం చేస్తుంది.
అటు ఇటీవలే పవన్ కల్యాణ్ యాక్టివ్ అయ్యారు. ఒక్కసారిగా రోడ్ల అంశాన్ని తీసుకుని జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై గట్టిగా ఫైట్ చేస్తున్నారు. ఇక జగన్ సైతం త్వరగా రోడ్ల మరమ్మత్తులు చేయాలని అధికారులని ఆదేశించారు. ఈ సమస్యలకు తోడు వినాయకచవితి పండుగ కూడా జగన్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. కోవిడ్ నేపథ్యంలో పండుగ ఇంట్లోనే జరుపుకోవాలని, వినాయకుడు ఊరేగింపులు, నిమజ్జనాలకు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఏపీలోని హిందూ సంఘాలు, బిజేపి, ఇతర పార్టీలు ఫైర్ అవుతున్నాయి.
సినిమా హళ్ళు, మద్యం షాపులు తెరవడానికి లేని ఇబ్బంది వినాయకచవితికి ఎలా వచ్చిందని ఫైర్ అవుతున్నారు. దీనిపై బిజేపి, జగన్ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేసింది. ఇలా ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంపై ఎటాకింగ్ మోడ్‌లో ఉన్నాయి. మరి ఈ సమస్యల నుంచి జగన్ ఎలా బయటపడతారో చూడాలి.