చవితి పందిళ్ల వేయకు? ఎస్పీ వార్నింగ్ ఇస్తే !
పెద్ద చెవులు చిన్న కళ్లు ఉన్న రూపం ఒకటి
జీవితాన్ని నడిపిస్తుంది.. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్యా!
ఇలా ఇంట్లోనే అనుకోవాలి వీధిలో అనుకోకండి
ఎస్పీ గారికి కోపం వస్తుంది.. పందిళ్లను వేయకండి
అది కూడా కరోనా నియంత్రణలో భాగమే అని గుర్తిస్తే చాలు
చెప్పాలనుకున్నదేదో చెప్పండి ఎవ్వరూ కాదనరు. శ్రీకాకుళం ఎస్పీ నుంచి డీజీపీ వరకూ అంతా చెప్పండి ఏం కాదు కానీ చెప్పేదే దో కాస్త శాంతంగా చెబితే ఎవ్వరయినా ఆనందిస్తారు. ఏటా పెద్ద పండుగలా చేసుకునే కోలాహలం చవితిని వద్దని చెబుతుండడం మీ కు కరోనా ఒక్కటే కారణం అని అర్థం చేసుకోగలం. ఆ కారణంగా మీరు వద్దంటున్నారు సరే! కనీసం పందిళ్ల ఏర్పాటు కూడా గుడిలో చేసుకోకూడదని చెబుతున్నారు సరే ఇన్నీ చెప్పాక ఇన్నీ చేశాక కరోనా అస్సలు రాదని మీ ఉద్దేశం అని అనుకుంటాం సర్ .. ఏం కాదు కానీ ఈ పండుగ నుంచి మా నుంచి మేం కోరుకునేది ఒక్కటే మీరు చెప్పిన ఆదేశాల్లోనే మా జీవితం భద్రంగా ఉండాలని! మీరు సాధించిన ఫలితాల్లో అయినా కరోనా మహమ్మారి విజృంభించక ఉండాలని కోరుకుంటాం.
మన ఊళ్లల్లో చవితి సంబరం వస్తుందంటే అదొక పిల్లల పండుగ..పెద్దల పండుగ..ఆనందాలకు హేతువు..మనం అనుకున్నంతగా ఈ పండుగ.. శక్తి ఉన్నంతగా ఈ పండుగ..ఇవన్నీ మనం చెప్పుకునేవి.. చేసుకుని తీరాలనుకున్నవి. మహమ్మారుల రాక కారణం గా జీవితం మారిపోయింది. ఇంకా చెప్పాలంటే.. ఇది ఉండ్రాళ్లయ్య పండుగ..వినాయక చవితి పండుగ..నవరాత్రుల పండుగ..ఈ పం డుగతోనే భాద్రపదం భవ్యం అవుతుంది. ఈ ఆరంభం తోనే తెలుగు లోగిళ్లు సంబరపడతాయి. కొవిడ్ కారణంగా గత ఏడాది ఈ పం డుగకు చ వితి పందిళ్ల ఏర్పాటుకు సీఎం జగన్ అనుమ తి ఇవ్వలేదు. ఈ రోజు కూడా ఇదే మాట చెబుతున్నారు. దీంతో హిందువు లంతా జగన్ నిర్ణయంపై కోపంగా ఉన్నారు. వివిధ జిల్లా లలో ఉన్న ఎస్పీలు, డీఎస్పీలు విశ్వాసాలను ప్రశ్నించేలా వార్నింగ్ లు ఇ స్తున్నారు. ఇది సబబు కాదని పలువురు చెబుతున్నా రు.