జగన్ ఆర్థికం : ఓట్ల కోసం నోట్లు
పాలిత వ్యవస్థలపై సంక్షేమం ప్రభావం ఉండదు
కానీ ఆర్థిక రంగం మాత్రం కుదేలవుతోంది
ముందూ వెనుకా లేకుండా డబ్బులు పంచితేనే
ఫలితం? అన్న అపోహ ఒకటి వైసీపీ వీడితే
కాస్తయినా అభివృద్ధి పనులకు నిధులు లభ్యం అవుతాయి
కొన్ని వేల కోట్ల రూపాయలను పథకాలు పేరిట వెచ్చిస్తున్నా ఫలితాలు ఎలా ఉంటాయో తెలియని సందిగ్ధం ఒకటి నెలకొని ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులంతా వైసీపీకే ఓటేస్తారని ఏంటి గ్యారంటీ? ఒకవేళ రేపు వైసీపీ ప్రభుత్వం అనుకున్న విధంగా ఓట్లు రాలక పో తే ఇన్ని కోట్ల రూపాయల నిధులూ వృథానే కదా! కానీ ఈ పాటి ఆలోచన ప్రభుత్వం అయితే చేయడం లేదు. ఆర్థిక రంగాన్ని ప్రభా వితం చేసే ఏ పని కూడా ముందున్న కాలంలో ప్రమాదమే అని గుర్తించడం లేదు. వైసీపీ ప్రభుత్వం నమ్మకం అంతా సంక్షేమ పథ కాలపైనే ఉంచి, కనీస పనులపై జాగ్రత్త వహించకపోవడంతో చాలా రోజులుగా విమర్శలు ఎదుర్కొంటోంది. వ్యవసాయ రంగాన్ని ఆ దుకుంటే సరిపోతుందని భావిస్తే, ఆ రంగంపై కూడా వైసీపీ ముద్ర లేదన్నది సుస్పష్టం.
పథకాల తీరు ఎలా ఉన్నా ఓట్ల కోసం నోట్ల పంపణీ అన్నది తేటతెల్లం అయిపోయింది. జగన్ మాత్రం ఇదంతా సంక్షేమమే అని భా వించడంలో అర్థం లేదు. సాధికారత అన్నది సాధ్యం కానప్పుడు ఇలాంటివేవో చెబుతుంటారు. ఆర్థికంగా ప్రజలను నిలబెట్టే ప్రయ త్నాలేవీ జరగడం లేదు. కొన్ని స్కీంల కారణంగా నిధులు పక్కదోవ పడుతున్నాయి అన్న విమర్శలు కూడా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు ఓట్ల రూపంలో మారాలంటే మరో రెండున్నరేళ్లు ఆగాల్సిందే. ఆర్థిక రంగం ఎలా ఉ న్నా జగన్ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ఇది కూడా ఫక్తు ఓటుకు నోటు కేసు లాంటిదే. ఆ రోజు తెలంగాణలో జరిగిందే ఇక్కడా జ రుగుతోంది. ప్రభుత్వమే అధికారికంగా, గంపగుత్తగా ఓట్లు కొనుక్కొంటోంది. ఈ ఓట్ల వేటలో భాగంగా పూర్తిగా అభివృద్ధి పనులు అ న్నీ నిలిచిపోయాయి. రోడ్లు, బ్రిడ్జిలు నిర్మాణం అన్నవే ఆగిపోయి చాలా కాలం అయింది. వర్షాకాలంలో గుంతలు కా రణంగా ప్ర యాణికులు అవస్థలు పడుతున్నా, కనీసం వాటికి మరమ్మతు చేసే నాథుడే లేకపోయాడు.