ఏపీ స్కూళ్లలో కరోనా కల్లోలం..!
చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని ఓ విద్యా సంస్థలో 11మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఇక్కడ చదువుతున్న 10మంది విద్యార్థులు సహా డైనింగ్ హాల్ నిర్వహించే ఓ వ్యక్తికి పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. పాజిటివ్ గా తేలిన విద్యార్థులంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఆ విద్యాసంస్థలో ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఆ విద్యాసంస్థలో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యురాలు గుర్తించి సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చిందన్నారు.
మరోవైపు ఉపాధ్యాయుల సెలవులను పాఠశాల విద్యాశాఖ తగ్గించింది. కరోనా నేపథ్యంలో పనిదినాలు తగ్గించడంతో సాధారణ సెలవులను తగ్గిస్తున్నట్టు చెప్పింది. ఉపాధ్యాయులకు 12నెలలకు 22సెలవుల లెక్కన.. ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు 9సెలవులు ఇవ్వనున్నారు. అటు కరోనా కారణంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. అయితే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ఇచ్చేందుకు దరఖాస్తులు చేసుకోవాలంది.
ఇక మనదేశంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. కొత్తగా 42వేల 618మందికి వైరస్ సోకింది. మరో 330మంది కోవిడ్ తో మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 4లక్షల 40వేల 225కు చేరింది. ఇక దేశంలో మొత్తం 3కోట్ల 29లక్షల 45వేల 907 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 4లక్షల 40వేల 225యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజే 36వేల 385మంది కరోనాను జయించారు. శుక్రవారం 58లక్షల 85వేల 687మంది టీకా తీసుకున్నారు.