తాలిబన్ల అరాచకాల వెనుక పాక్ కుట్ర.. బయటపెట్టిన వార్తాసంస్థ..?

Chakravarthi Kalyan
తాలిబన్లు ఇప్పుడు అఫ్గాన్‌ పాలకులుగా మారారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ అఫ్గాన్ లో అధికారం చేజిక్కించుకున్నారు. కొన్ని నెలల క్రితం నుంచి అనూహ్యంగా పుంజుకున్న తాలిబన్లు.. ఏకంగా రాజధాని కాబూల్‌ను వశం చేసుకుని అధికారం చేజిక్కించుకున్నారు. అయితే.. తాలిబన్లు ఇంతగా రెచ్చిపోవడానికి అసలు కారణం మాత్రం అఫ్గానిస్తాన్‌ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికా నిర్ణయించుకోవడమే. ఇదీ ఇప్పటివరకూ ప్రపంచానికి తెలిసిన వాస్తవం.


కానీ అఫ్గాన్‌లో తాలిబన్ల దూకుడు వెనుక పాకిస్తాన్‌ హస్తం ఉందట. తాలిబన్లు ఇంత త్వరగా అఫ్ఘాన్‌ను ఆక్రమించడంలో తాలిబన్లకు పాకిస్తాన్‌ సహకరించిందట. అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం వెనక పాకిస్తాన్‌ కీలక పాత్ర పోషించినట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. ఇందుకు సంబంధించిన కీలక ఆధారాలను వెల్లడించింది. పాక్‌కి చెందిన 10నుంచి 15వేల మంది ఉగ్రవాదులు అఫ్గాన్‌ సరిహద్దుల్లోకి ప్రవేశించారని అఫ్గాన్ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు ముందుగానే చెప్పాడట.


ఈ ఏడాది జులై 23న రెండు దేశాల అధినేతలు ఫోన్‌ సంభాషించుకున్నారని.. ఆ సమయంలోనే పాక్ కుట్రను అష్రఫ్‌ ఘనీ, బైడెన్‌ దృష్టికి తీసికెళ్లాడని తెలుస్తోంది. పాక్ అఫ్గాన్‌ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసేందుకు అన్ని విధాలుగా ముష్కరులకు సాయం చేస్తోందని ఘనీ బైడెన్‌తో మొత్తుకున్నారట. అయితే తాలిబన్లను తక్కువ అంచనా వేసిన జో బైడెన్‌ ఏం పర్వాలేదు.. మేమున్నాం లే అంటూ సర్దిచెప్పినట్టు రాయిటర్స్ తెలిపింది.


ఇలా వీరిద్దరూ మాట్లాడుకున్న కొన్ని వారాల్లోనే తాలిబన్లు రెచ్చిపోయారు. ఒక్కో ప్రావిన్స్‌లోనూ విజయం సాధిస్తూ కాబూల్‌ను చుట్టుముట్టారు. ఇదీ తాలిబన్లను వెనకుండి నడిపించిన పాకిస్తాన్ వంచన కథ. ఇప్పుడు రాయిటర్స్ సంస్థ కథనంలో అసలు నిజాలు వెలుగు చూశాయి. ఇదీ పాక్ జిత్తులమారి ఎత్తుల కథ.. మరి ఇప్పటికైనా అమెరికా కళ్లు తెరుస్తుందా.. పాక్‌ను ప్రపంచం ముందు దోషిగా నిలబెడుతుందా.. లేక ఎప్పటిలాగానే వెనుకేసుకొస్తుందా.. అన్నది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: