చంద్ర‌బాబు అంటే విజ‌న్ : ఒక‌నాటి ప్ర‌మాణం !

RATNA KISHORE

ఎంఏ ఎక‌నామిక్స్ చ‌దువుకున్నారు చంద్ర‌బాబు. చ‌దువుతో పాటు రాజకీయాల్లోనూ రాజీ లేని పేజీలు కొన్ని రాసుకున్నారు. త ప్పొప్పుల చిట్టాకు ఆయ‌న అతీతులు కాకున్నా కొంద‌రి కార‌ణంగా మాత్ర‌మే ప‌రువు పోగొట్టుకున్నారు. ఇవాళ అరుదైన సంద ర్భం. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా తొలిసారి ప‌ద‌వీ ప్ర‌మాణం చేసి పాతికేళ్లు నిండిన సంద‌ర్భం. తొలిసారి ఆయ‌న 1995 సెప్టెంబ‌ర్ ఒక టిన ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అదే ప‌ద‌విలో తొమ్మిదేళ్లు కొన‌సాగారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో అనేక స‌వాళ్ల‌ను దాటు కుని వ‌చ్చి త‌న పాల‌నా ద‌క్ష‌త‌తో మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక క‌థ‌నం.


పార్టీ ఎలా ఉన్నా ప్ర‌భుత్వం మాత్రం స్థిర‌మ‌యిన స్థావ‌రంగా ఉండాల‌ని కోరుకోవ‌డంలో అర్థం లేదు. పార్టీ ఎలా ఉన్నా ప్ర‌భుత్వం స్థి రమ‌యిన విజ‌యాల‌కు కార‌ణం కావాల‌ని కోరుకోడంలో అర్థం లేదు. పార్టీని,ప్ర‌భుత్వాన్ని బ‌లోపేతం చేయ‌డంలో చంద్ర‌బాబు త న‌దైన ముద్ర వేశారు. ముఖ్యంగా ఇప్ప‌టిలా కాకుండా ఉద్యోగులలో ఓ భ‌యం పుట్టించి ప‌రుగులు పెట్టించి కొన్ని ప‌నులు చేయిం చారు. ఉద్యోగుల‌లో ప‌ని చేసే త‌త్వం పెంపొందింప‌ జేశారు. టెక్నాల‌జీని అందిపుచ్చుకున్న చోట చంద్ర‌బాబు అంద‌రి క‌న్నా ముందే ఉన్నారు. ఫైళ్ల క్లియ‌రెన్సుకు ప్రాధాన్యం ఇచ్చారు. మోతాదుకు మించి రాజ‌ధాని హైద్రాబాద్ పై ఆ రోజు ఆయ‌న ప్రేమ పెంచుకు న్నారు. ఆ ప్రేమ కొంత మేర స‌ఫ‌లీకృతం అయినా కొంత మేర విరుగుడు రూపానికి తావిచ్చింది. ఇప్ప‌టి హైటెక్ సిటి ఆయ‌న క‌ల ల రూపం.స్వ‌ర్ణాంధ్ర ప్ర‌దేశ్ అన్న సుంద‌ర స్వ‌ప్నం ఆయ‌న నినాదం. క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన‌ ప్ర‌తి సారీ చంద్ర‌ బాబు ఇత‌రుల‌కు ఎంతో ఆద‌ర్శంగా నిలిచారు. మొన్న‌టి వేళ ఆయ‌న‌కు కొన్ని అడ్డంకులు వ‌చ్చాయి. పార్టీ ఆయ‌న చేతిలో లేకుండా పోయింది. నారాయ ణ లాంటి లీడ‌ర్లే కొంప‌ముంచారు. మీడియా జోకుడు గాళ్ల కార‌ణంగా ఆయ‌న చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అప్ప‌టి సీఎం గా ఎన్నో మంచి ప‌నులు చేశారు. చేయించారు. జ‌న్మ‌భూమి పేరిట గ్రామాల‌ను సంద‌ర్శించారు. వారి స‌మ‌స్య‌ల‌కు అక్క‌డిక్క‌డే ప‌రిష్కారం ఇచ్చారు.
ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు పాల‌న, ప్ర‌జ‌ల‌తో ముఖ్య‌మంత్రి (ఫోన్ ఇన్ కార్య‌క్ర‌మం) వంటి కార్య‌క్ర‌మాలే ఆయ‌న‌కు మంచి పేరు తెచ్చాయి. కానీ దుర‌దృష్టం కొద్ది సుజ‌నా, సీఎం ర‌మేశ్ లాంటి నేత‌లు, ఇంకా ఇంకొంద‌రు చంద్ర‌బాబును మొ న్న‌టి వేళ నిలువునా ముంచారు. ఆ య‌న అప్ప‌టిలా ఉంటే ఇప్పుడున్న పార్టీ ఇలా ఉండ‌దు. మున‌ప‌టి క్ర‌మ‌శిక్ష‌ణ ఆయ‌నలో ఉన్నా క్యాడ‌ర్ లో లేదు. ఆయ‌న సా ధ్యం కానివి చెప్పి ప‌థ‌కాల పేరిట ప్ర‌సంగాలు ఊద‌ర‌గొట్ట‌లే దు. కానీ ఒకే ఒక్క త‌ప్పిదం కార‌ణంగానే ఆయ‌నీ రోజు అధికారానికి దూరం అయ్యారు. లోకేశ్ ను సీఎం చేయాల‌న్న త‌లంపు ఒక్క‌టే ఆయ‌న పాలిట హానిక‌రంగా మారింది. ఇప్ప‌టికీ ఆయ‌న‌ను అభి మానించే వారికి చంద్ర‌ బాబు అంటే అప్ప‌టి సీఎంగానే గుర్తు. రాష్ట్రం విడిపోయాక ఆయ‌న చేసినంత చేశారు కానీ అందుకు రెట్టిం చిన స్థాయిలో త‌ప్పిదాలూ చేశారు.
కొన్ని విష‌యాల్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి చంద్ర‌బాబును అనుస‌రించిన సంద‌ర్భాలు ఉన్నాయి కానీ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అధికారుల‌ను త‌న సొంత మ‌నుషులుగా చూసుకున్న వైనం మాత్రం కాస్త విడ్డూరమే! తమ ప్ర‌మేయం లేకుండానే ఎన్నో త‌ప్పిదాల‌కు త‌మ‌ను బ‌లి చేశార‌ని రాజ‌శేఖ‌ర్ రెడ్డి కాలంలో ప‌నిచేసిన ఐఎఎస్ లు బాధ‌ప‌డుతుంటారు. సొంత ప్ర‌యోజ‌నాల నెర‌వేర్పులో చంద్ర‌బాబు, రాజ‌శే ఖర రెడ్డి ఇద్ద‌రూ కాస్త పోలిక‌ల‌తో కూడిన రాజ‌కీయాలే నె ర‌వేర్చారు. కానీ రాజ‌శేఖ‌రరెడ్డి అప్ప‌ట్లో జ‌గ‌న్ ను అంత‌గా ప్రోత్స‌హించ లేదు. మంత్రి ప‌ద‌వులను క‌ట్ట‌బెట్ట‌లేదు. రాష్ట్ర ప‌రిణామాల్లో జోక్యం చేసుకోనివ్వ‌లేదు. కానీ చంద్ర‌బాబు మాత్రం లోకేశ్ ను రెండో సీ ఎంగా చూపారు. డిప్యూటీ సీఎంల‌ను డ‌మ్మీల‌ను చేశా రు. ఇలాంటి త‌ప్పిదాలు మిన‌హాయిస్తే రాజ‌శేఖ‌ర్ రెడ్డి క‌న్నా, జ‌గ‌న్ క‌న్నా మంచి అడ్మిన‌స్ట్రేట‌ర్ చంద్ర‌బాబే! ఇక ఢిల్లీ రాజ‌కీయాల్లోనూ చంద్రబాబే మంచి ప్ర‌తిభ‌ను చూపారు అన్న‌ది కూడా వాస్త‌వం. ఆర్థిక సంబంధ నిర్ణ‌యాల్లో చంద్రబాబు క‌న్నా రాజ‌శేఖ‌ర్ రెడ్డి దూకుడే ఎక్కువ. కానీ చంద్ర‌బాబు గ‌తంలో మాదిరిగానే అడ్మిన్ పై ప‌ట్టు కోల్పోయిన కార‌ణంగానే మొన్న‌టి వేళ ఆయ‌న అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొన్నా రు. పార్టీలో సీనియ‌ర్లు ఉన్నా వారంతా లోకేశ్ డై రెక్ష‌న్లో ప‌నిచేయాల్సి రావ‌డం కూడా ఓ పెద్ద మైన‌స్. తొమ్మిదేళ్ల ముఖ్య‌మంత్రి బాగున్నాడు. అభివృద్ధి ఏంటో కాస్త‌యినా చూపాడు కానీ ఉద్య‌మాల‌ను అణిచివేసే చ‌ర్య‌ల‌లో మాత్రం ఆయ‌న ఎంతో అప‌ఖ్యాతిని మూట‌గ‌ట్టుకున్నాడు. విద్యుత్ ఉద్య‌మాల విష‌య‌మై ఇప్ప‌టికీ నాటి గాయాలు క‌న‌పడుతూనే ఉంటాయి. చంద్ర‌బాబు అంటే విజన్ అని ఓ నినాదం అప్ప‌ట్లో బాగా పాపులర్ అయ్యేది.
ఆ త‌రువాత కాలంలో ఆ విజ‌న్ కాస్త పార్టీకి చెంద‌ని పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లో ఉండిపోయింది అన్న అప‌వాదు ఆయ‌న మూట‌గ‌ట్టుకు న్నారు. ఇప్ప‌టికీ ఆయ‌న‌కు పార్టీని న‌డిపే శ‌క్తి ఉన్నా, నిన్న‌టి త‌ప్పిదాల దిద్దుబాటు అన్న‌ది లేదు. క‌నుక‌నే ఇంకా లోకేశ్ డైరెక్ష న్లో పార్టీని ముందుకు తీసుకువెళ్లాలన్న ఆలోచ‌న‌లో ఆయ‌న ఉండిపోతున్నారు. అలా కాకుండా ఉంటే చంద్ర‌బాబు రాణిస్తారు. పా ర్టీ బ‌తుకుతుంది. మ‌ళ్లీ నాటి చంద్ర‌బాబు తెర‌పైకి రావాలి. ఉద్యోగులు ప‌రుగులు తీస్తే, ఓ సైబ‌రాబాద్ ట‌వ‌ర్స్ పోలిన  నిర్మాణాల‌ను చేప‌ట్ట‌గ‌లిగితే, ఈ ఉచిత ప‌థ‌కాలు అన్నీ ఆప‌గ‌లిగితే ఎంతో సంతోషించే అభిమానులు ఇవాళ్టికీ చంద్ర‌బాబుకు ఉన్నారు. కానీ అవి సాధ్య‌మా ! పెద్ద‌వాడు అయిపోయాడు ఇంకేం.. కొత్త నిర్ణ‌యాల అమ‌లు ఆయ‌న చేతిలో లేక‌పోవ‌డమే విచార‌క‌రం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp

సంబంధిత వార్తలు: