ఈ సెప్టెంబర్ మాసంలో... మీకేమైనా బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా..? అయితే బ్యాంకు వెళ్లే ముందు మీరు కచ్చితంగా... సెప్టెంబర్ మాసం లో బ్యాంకు ల సెలవుల గురించి తెలుసుకోవాల్సిందే. ఆగస్టు మాసం నుంచి తెలుగు పండుగల సీజన్ స్టార్ట్ అయింది. ఇంకేం ఈ పండు గల సీజన్ ఈ ఏడాది చివరి డిసెంబర్ వరకు కొనసాగనుంది. దీంతో వచ్చే నెలలో చాలా హాలిడేస్ వస్తాయి. అలాగే బ్యాంకులకు కూడా చాలా వరకు సెలవులు లభిస్తాయి. రెండో శనివారం, నాలుగో శనివారం మరియు ఆదివారాలు కాక ఇంకా ఎన్నో పండుగల సెలవులు కూడా రానున్నాయి. అయితే మన రిజర్వు బ్యాంక్... నియమ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ మాసంలో బ్యాంకులకు ఏకంగా పన్నెండు రోజులు సెలవులు రానున్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ని బ్యాంకులకు మాత్రం కేవలం 7 రోజులు మాత్రమే సెలవులు ఉండనున్నాయి. అయితే ఇప్పుడు ఆ బ్యాంకు సెలవుల వివరాలు తెలుసుకుందాం.
సెప్టెంబర్ 5 వ తేదీ - ఆదివారం
సెప్టెంబర్ 8 వ తేదీ- శ్రీమంత శంకరా దేవ తిది
సెప్టెంబర్ 9 వ తేదీ- తీజ్ పండగ
సెప్టెంబర్ 10 వ తేదీ - వినాయక చవితి
సెప్టెంబరు 11 వ తేదీ -రెండవ శనివారం
సెప్టెంబర్ 12 వ తేదీ - ఆదివారం
సెప్టెంబర్ 17 వ తేదీ - కర్మ పూజ
సెప్టెంబర్ 19 వ తేదీ - ఆదివారం
సెప్టెంబర్ 20 వ తేదీ - ఇంద్ర జాతర
సెప్టెంబర్ 21 వ తేదీ - శ్రీ నారాయణ గురు సమాధి రోజు
సెప్టెంబర్ 25 వ తేదీ - నాలుగో శనివారం
సెప్టెంబర్ 26వ తేదీ - ఆదివారం
అయితే పైన తెలిపిన సెలవులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం 7 రోజులు మాత్రమే సెలవులు లభించ నున్నాయి.