చైనాపై ఏమాత్రం తగ్గేది లేదంటున్న ఇండియా..? ఇదిగో సాక్ష్యం..?

Chakravarthi Kalyan
చైనా.. ఇండియాకు పక్కలో బల్లెం.. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఈ జిత్తుల మారి చైనాను ఎదుర్కొనేందుకు ఇండియా ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి.. ఉంటోంది కూడా. మన భారత్‌ సైన్యంలో మూడు ప్రధాన విభాగాలున్నాయి.. సైన్యం, వైమానిక దళం, నావికా దళం. ఈ మూడు సమన్వయంతో ముందుకు సాగుతుంటాయి. ఇప్పుడు భారత నౌకాదళం.. క్వాడ్ దేశాలతో పాటు మలబార్ సైనిక విన్యాసాలు చేసేందుకు రెడీ అయ్యింది.


క్వాడ్ దేశాలైన ఇండియా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా ఈ మలబార్ విన్యాసాలు చేయబోతున్నాయి. ఆ విన్యాసాలు చేస్తున్నదెక్కడో తెలుసా.. దక్షిణ చైనా సముద్రానికి కూతవేటు దూరంలోనే.. దక్షిణ చైనా సమీపంలోని ఫిలిప్పీన్స్‌ సముద్ర జలాల్లోనే ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. ప్రస్తుతం మలబార్ నౌకా విన్యాసాలకు భారత్‌ సిద్ధమవుతోంది. అయితే వీటిని చైనా అడ్డుకోవాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు.


అవకాశం ఇస్తే.. సముద్రాన్ని కూడా తన ప్రయోజాలకు అనుగుణంగా వాడుకునే దేశం చైనా.. అందుకే చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ వెనుకడుగు వేయడం లేదు. అందుకే వ్యూహాత్మకంగా క్వాడ్‌ దేశాలతో మైత్రి సాగిస్తోంది. మరోవైపు చైనా తాలిబన్లతోనూ స్నేహం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తాలిబన్లతో స్నేహం వెనుక కూడా చైనా నక్కజిత్తులే ఉన్నాయి. తాలిబన్లను గుప్పిట్టో పెట్టుకుంటే.. భారత్ వంటి దేశాల్లో అలజడులు రేపడం చైనాకు సులువు అవుతుంది.


ఈ విషయం భారత్ గమనించకపోలేదు. అయితే.. ఇప్పుడు చైనాకు మరో చిక్కు వచ్చిపడింది. తాము భారత్‌తో సత్సంబంధాలు పెట్టుకుంటామని తాలిబన్ల ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడారు. దీంతో తన అంచనాలు తప్పుతున్నాయనే భావనలో చైనా ఉంటోంది. దీనికి తోడు ఇండియా కూడా సై అంటే సై అంటూ దేనికైనా సిద్ధంగా ఉండటం చైనాను కలవరపరుస్తోంది. ఇప్పుడు ఈ మలబార్ విన్యాసాలు నిర్వహించడం కూడా చైనాకు కడుపుమంటగానే తోస్తుంది. మొత్తానికి చైనా విషయంలో మాత్రం భారత్ ఏమాత్రం తగ్గట్లేదని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: