ప‌సుపు అంటే బాధ్య‌త : ఢిల్లీలో నీటి పంచాయితీ

RATNA KISHORE
చాలా రోజులకు టీడీపీ తన పంధాను కాస్త మార్చి రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముంద‌డుగు వేసింది. జ‌ల‌ వి వాదాల విష‌య‌మై తె లంగాణ ప్రభుత్వం పై కొన్ని ఆరోపణలు చేస్తూనే, వాస్తవాలు వివరించేందుకు ప్రయ‌ త్నించింది. తాము ప్రత్యేకమైన సందర్భంలో ఢి ల్లీకి రావాల్సి వచ్చింది అని పేర్కొంటూ ప్రకాశం జిల్లా ఇవాళ జల వివాదాలు విషయమై ఏ విధంగా నష్టపోయింది అన్నది వివరిం చింది.  ఇదే సంద‌ర్భంలో కేంద్రానికి కొ న్ని స్థానిక పరిస్థితులను వివ‌రించేందుకు ప్రయత్నం చేసింది. ఆ..వివ‌రం..ఈ..క‌థ‌నంలో..
దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఆసక్తిదాయక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కృష్ణా జలాలకు సంబంధించి ఇప్పటిదాకా నెలకొన్న వివాదాలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా టిడిపి నాయకులు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావ‌త్ ను కలుసుకొని తమ విన్నపాన్ని ఆయన దృష్టికి తీసుకొనివెళ్ళారు. గత కొద్ది రోజులు గా వైసీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టు విషయమై కేంద్రానికి చెప్పాల్సిన మాటలేవీ చెప్పడం లేదని ఆరోపిస్తూ టిడిపి జలవివాదం విషయమై తన గొంతుకను వినిపించి ప్రత్యేకతను చాటుకుంది.
రాష్ట్ర ప్రయోజనాల విషయమై తెలంగాణ సర్కారు తో జగన్ కొట్లాట అన్నది లేదు అని ఎప్పటి నుంచో టిడిపి చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా కేంద్రం విడుదల చేసిన గెజిట్లో వెలిగొండ ప్రాజెక్టు పేరును చేర్చకపోవడం కృష్ణ బోర్డు విధివిధానాల‌కు సంబంధించి ఈ మేరకు ఇటువంటి ఒత్తిడి తీసుకు రాకపోవడం అన్నవి ఎంత మాత్రం సబబు కాదు అని వైసీపీ ని ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్య లు కొన్ని చేసింది. కృష్ణా జలాల కేటాయింపు లేకపో తే తమ ప్రాంతం తాగు సాగు నీరు విషయాలలో సమస్యలను ఎదుర్కొనక తప్ప దని టిడిపి నాయకులు ఆవే దన చెందారు. ప్రకాశం జిల్లా నుంచి ఢిల్లీకి తరలిన నాయకులలో గొట్టిపాటి రవి తో సహా కొందరు నాయకులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: