రాజమండ్రిలో టీడీపీకి తొలిసారి అదిరిపోయే షాక్?

M N Amaleswara rao
ఏపీలో గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ, ఆ తర్వాత జరిగే ప్రతి ఎన్నికల్లోనూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఎన్నికలు ఏవైనా విజయం మాత్రం వైసీపీదే. పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్, తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అదిరిపోయే విజయాలు సొంతం చేసుకుంది. ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాలు రాలేదు గానీ, వాటిల్లో కూడా వైసీపీ సూపర్ విక్టరీ సాధించడం ఖాయమని చెప్పొచ్చు.

మామూలుగా అధికార పార్టీలకు గెలవడానికి కాస్త అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వైసీపీకి ఏంటో గెలుపు వన్‌సైడ్ అయిపోతుంది. ఈ పరిస్తితిని బట్టి చూస్తే నెక్స్ట్ ఏపీలో ఏ ఎన్నికలు జరిగిన వైసీపీ సత్తా చాటడం ఖాయమని చెప్పొచ్చు. అయితే వాయిదా పడిన కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతుంది. అలాగే కాకినాడ, రాజమండ్రి కార్పొరేషన్ స్థానాలకు  ఎన్నికలు పెట్టడానికి కూడా ఎలక్షన్ కమిషన్ సన్నద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ క్లీన్‌స్వీప్ చేయడం పెద్ద కష్టం కాదనే చెప్పొచ్చు. ముఖ్యంగా రాజమండ్రి కార్పొరేషన్‌లో తొలిసారి వైసీపీ జెండా ఎగరనుందని విశ్లేషణలు వస్తున్నాయి. రాజమండ్రి కార్పొరేషన్ ఏర్పాడ్డాక జరిగిన మూడు ఎన్నికల్లోనూ టీడీపీనే గెలిచింది. అయితే ఈ సారి పరిస్తితి అలా ఉండదని తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉండటం, జగన్ ఇమేజ్, పైగా రాజమండ్రి టీడీపీలో ఉన్న లుకలుకలు వైసీపీకి బాగా కలిసొచ్చేలా కనిపిస్తున్నాయి.

రాజమండ్రి రూరల్ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరీకి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఫ్యామిలీలకు పెద్దగా పొసగడం లేదనే సంగతి తెలిసిందే. నగరంలో పట్టున్న బుచ్చయ్య వర్గాన్ని ఆదిరెడ్డి ఫ్యామిలీ సైడ్ చేసేస్తుంది. అందుకే బుచ్చయ్య సైతం ఈ మధ్య అలకపాన్పు ఎక్కారు. ఇలా పార్టీలో నాయకుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలే ఫస్ట్ టైమ్ రాజమండ్రిలో టీడీపీ ఓటమికి కారణం కానున్నాయని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: