రాష్ట్రం మొత్తం ఊగిపోతుంటే.. జగన్ కు అసలు టెన్షనే లేదా?
ఇలా జగన్ బెయిల్ పిటిషన్ పై అందరిలో ఉన్న ఉత్కంఠ ను ఇక మీడియా సంస్థలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలతో పీక్ స్టేజ్ కి తీసుకెళ్లారు. ఇక ఇలాంటి సమయంలో జగన్ రెడ్డి భయపడిపోతారు.. వైసీపీ నేతలు అందరూ ఆందోళనలో మునిగి పోయారు అన్న చర్చ కూడా జరిగింది. కానీ వాస్తవానికి జరిగింది మాత్రం వేరేలా ఉంది. ప్రతి ఒక్కరిలో జగన్ బెయిల్ పిటిషన్ పై ఉత్కంఠ నెలకొంటే అటు జగన్ మాత్రం బెయిల్ పిటిషన్ ను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. బెయిల్ పిటిషన్ గురించి అంతటా ఉత్కంఠ నెలకొంటే జగన్ మాత్రం అది పట్టించుకోకుండా ఏకంగా తన ఫ్యామిలీతో ఈనెలాఖరులో ఒక టూర్ ఏర్పాటు చేసుకోవడం సంచలనంగా మారింది.
అదే సమయంలో ఇక నిన్న అందరూ జగన్ బెయిల్ పిటిషన్ విషయంలో కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందో అని ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే అటు సీఎం జగన్ మాత్రం నిన్న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు ఆయన కార్యాలయంలో చిన్నారులకు వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి రివ్యూ చేసుకుంటూ వచ్చారు. నిమోనియా మరణాల నివారణకు ఈ వ్యాక్సినేషన్ నిర్వహించారు. వెంటనే జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కూడా జగన్ సమీక్ష నిర్వహించారు. ఇలా జగన్ బెయిల్ పిటిషన్ గురించి ఎలాంటి టెన్షన్ పడకుండా రోజు వారిలాగానే తన కార్యక్రమాలను పెట్టుకున్నారు. దీంతో ఈ బెయిల్ పిటిషన్ను జగన్ లైట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు విశ్లేషకులు.