సీమలో బాబుని వైసీపీ ఎమ్మెల్యేలే నిలబెట్టాలి...!
ఇక 2019 ఎన్నికల్లో టీడీపీకి చుక్కలు కనబడ్డాయి. మొత్తం 52 సీట్లలో వైసీపీ 49 సీట్లు గెలుచుకుంటే, టీడీపీ కేవలం 3 సీట్లకే పరిమితమైంది. ఇటు రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేసింది...మరి ఈ రెండేళ్లలో కూడా సీమలో పార్టీల బలాబలాలు ఏమన్నా మారాయంటే...కాస్త మారినట్లే కనిపిస్తోంది. ఇక్కడ వైసీపీ బలం తగ్గుతుండగా, టీడీపీ బలం పెరుగుతున్నట్లు కొన్ని సర్వేల్లో తేలింది. అలా అని వైసీపీని దాటుకుని టీడీపీ అయితే ఆధిక్యం దక్కించుకోలేదని తెలుస్తోంది.
కానీ గత ఎన్నికల కంటే టీడీపీ పరిస్తితి కాస్త మెరుగైనట్లే సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి వైసీపీ ఎమ్మెల్యేలపై కాస్త వ్యతిరేకత పెరుగుతుంది. కొందరు ఎమ్మెల్యేలు అక్రమాలు ఎక్కువ అయ్యాయని, దాని వల్ల వైసీపీకి నష్టం జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్తితుల్లో టీడీపీకి కనీసం 15 పైనే స్థానాల్లో బలం పెరిగినట్లు తెలుస్తోంది. అంటే ఇక ఆ స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు వీక్ అయినట్లే చెప్పొచ్చు. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీ ఎమ్మెల్యేల మీద ఆధారపడే టీడీపీ భవిష్యత్ ఉంది. ఎమ్మెల్యేల మీద ఎంత నెగిటివ్ వస్తే అంత టీడీపీకి ప్లస్. అంటే సీమలో వైసీపీ ఎమ్మెల్యేలే బాబుని నిలబెట్టేలా ఉన్నారు.