సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు ఉండవు : సబితా ఇంద్రారెడ్డి

frame సెప్టెంబర్ 1 నుంచి ఆన్లైన్ క్లాసులు ఉండవు : సబితా ఇంద్రారెడ్డి

praveen
కరోనా వైరస్ కారణంగా తెలంగాణలో మూతపడిన విద్యాసంస్థలు తెరవాలని అటు రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రయత్నాలు చేసింది. కానీ కరోనా వైరస్ కారణంగా ఇక వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే గతంలో సెకండ్ వేవ్ కరోనా వైరస్ కు మందు మొదటి దశ కరోనా వైరస్ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టిన సమయంలో కొన్ని రోజులపాటు పాఠశాలలు తెరిచింది తెలంగాణ విద్యాశాఖ. కానీ అటు వెంటనే రెండవదశ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోవడంతో ఇక పాఠశాలలను మూసివేసే పరిస్థితి వచ్చింది.



 తర్వాత విద్యార్థులు చదువులు పాడవ కూడదు అనే ఉద్దేశంతో ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా విద్యాబోధన చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇకపోతే మొన్నటి వరకు సెకండ్ కరోనా వైరస్ కేసులు భారీగా ఉండడంతో విద్యాసంస్థలను తెరవాలి అని ఆలోచన కూడా చేయలేదు. ఇక ఇటీవలే కేసుల సంఖ్య తగ్గిపోవడంతో మళ్లీ పాఠశాలలు పునః ప్రారంభించేందుకు నిర్ణయించింది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇక పాఠశాలలు కళాశాలలు ప్రారంభించి ప్రత్యేక తరగతులను బోధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇక పాఠశాలలు పునః ప్రారంభం తర్వాత తమ పిల్లలను పాఠశాలకు పంపాలా వద్దా అని దానిపై  తల్లిదండ్రులదే తుది నిర్ణయం అని తెలిపింది.



 అయితే సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష  తరగతులు ప్రారంభం అయిన తరువాత ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తారా లేదా అన్న దానిపై ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభిస్తున్నామని ఆ రోజు నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించేది లేదని  స్పష్టం చేశారు. ఇక పాఠశాలల పునఃప్రారంభం తర్వాత 65 లక్షల మంది విద్యార్థులు పాఠశాలకు రానున్నారు అంటూ తెలిపారు. ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే వారికి కరోనా వైరస్  పరీక్షలు చేయాలని సూచించారు. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే నెలవారీగా వసూలు చేయాలి అంటూ సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: