సింగరేణి సైరన్ : బేగి రాయే సీతక్కా !
రేవంత్ కు రావాలి.. లేదా రేవంత్ కొన్ని నేర్చుకుని
అప్పుడు ఎవ్వరిని అయినా ఏమయినా అనేందుకు
బయలుదేరాలి.
తెలంగాణలో రెండంటే రెండే పార్టీలు యుద్ధాలు చేస్తున్నాయి. బీజేపీ ఉన్నా కూడా పెద్దగా ప్రభావం అయితే ఇప్పటికిప్పుడు చూ పడం లేదు. బండి సంజయ్ ఈ మధ్య తిట్టడం మొదలుపెట్టారు. అది మినహా బీజేపీ సాధించేందేదీ ఉండదు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలే తమ యుద్ధాలకు ప్రతినిధులను ఎంచుకుని వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. తెలుగుదేశం నుంచి వచ్చి తన సత్తా ఏంటో నిరూపించుకునే క్రమంలో రేవంత్ ఆయాసం పెంచుకుంటున్నారు. ఆపసోపాలు పడుతున్నారు. నాలుగు తిట్లు ఎక్కువ తిట్టి అధిష్టానం కనుసన్నల్లో పడడమే కాకుండా తెరపైకి సీతక్క ను తీసుకువచ్చి కొత్త యుద్ధం ఒకటి చేయాలని భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను పెద్దగా పరిగణించదు.
అతి ఆవేశం కారణంగా
ఆయన ప్రతి ఎన్నికకూ ఏదో ఒక హైప్ ఇవ్వడం అంత మంచిది కాదు
సింగరేణి బొగ్గు కాలరీస్ లో ఎక్కువ పేరు కాంగ్రెస్ కు ఉందా లేదా
కారు పార్టీకి ఉందా ? సీతక్క ఒకవేళ ప్రభావం చూపారే అనుకుందాం
రేపటి వేళ అక్కడ జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో ఆ మాత్రం దానికే
కేసీఆర్ ఓడిపోయి కాంగిరేసు గెలిచి సీఎం కుర్చీ పొందిందని అనుకోవాలా ?
పీసీసీ చీఫ్ పోస్టు అన్నది తెలంగాణ సీఎం పదవి అని రేవంత్ భావించినా సోనియా గాంధీ ఆ విధంగా భావించరు. మరెందుకు ఆ యనిలా రెచ్చిపోతున్నారంటే కేసీఆర్ ను అవకాశం ఉన్న ప్రతిచోటా నిలువరించాను అని పెద్దల ఎదుట గొప్పలు చెప్పుకునేందు కు. ఆ క్రమంలో మీడియాలో కనిపించి తన ప్రభావం ఏ మేరకు ఉందో హై కమాండ్ కు వివరించాలని భావిస్తున్నారు.
ఈ భావనలో భాగంగా సీతక్కను తెరపైకి తెస్తున్నారు. వాస్తవానికి రేపటి వేళ కాంగ్రెస్ లో ప్రాభవం తగ్గితే సొంత పార్టీ పెట్టే యోచన కూడా రేవంత్ కు ఉంది. అందుకు సీతక్కనే సాయం చేయాలి. ఇలా అన్నింటికీ అక్కే ఆధారం. తాజాగా సింగరేణి కార్మికుల సం ఘం ఎన్నికలు ఒకటి తెరపైకి వచ్చాయి. ఈ ఎన్నికలు కూడా తెలంగాణలో ప్రతిష్టాత్మకం. తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం పేరిట జరిగే ఈ ఎన్నికల జీవన్మరణ సమస్య అయితే కావు కానీ కవిత ఆ సంఘానికి ఇంత కాలం గౌరవాధ్యక్షురాలి పాత్రలో ఉన్నారు కనుక ఆమెపై పోటీగా సీతక్కను నిలిపి, తెగ హడావుడి చేసేందుకు రేవంత్ ఇప్పటి నుంచే ఆపసోపాలు పడి ఆయాసం తెచ్చుకుం టున్నారు. కానీ ఈ ఎన్నికల్లో గెలిచినా, గెలవకున్నా టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోదు కానీ కాంగ్రెస్ మాత్రం ఒకవేళ గెలిస్తే రేవంత్ అధిష్టానం దగ్గర కొంత మెప్పు పొందేందుకు అవకాశం ఉంది. ఓడిపోతే ఎందుకు ఓడిపోయామో చెప్పేందుకు, సానుభూతి పొం దేందుకు ఆస్కారం ఉంటుంది.