తెలంగాణ మంత్రులను బంగ్లాదేశ్ పంపిస్తాం ?

Veldandi Saikiran
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి  హరీష్ రావు కు బీజేపీ ఎమ్మెల్యే రఘనందన రావు కౌంటర్ ఇచ్చారు.   ధనిక రాష్ట్రమైతే ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వటం లేదో హరీష్ రావు చెప్పాలన్న రఘనందనరావు.. బీజేపీ లో పంచాయితీల సంగతి అటుంచి ... ఒకే కుటుంబంలో కేటీఆర్, కవిత పంచాయితీ ఏంటో ప్రజలకు చెప్పాలి? అని ఎద్దేవా చేశారు.  ప్రగతి భవన్ లోకి  ఎంట్రీ లేని హరీష్  తో నీతులు చెప్పించుకునే స్థితిలో బీజేపీ నేతలు లేరని ఫైర్ అయ్యారు.  ధనిక రాష్ట్రం లో నిరుద్యోగ భృతి ఎందుకు అమలు చేయటం లేదో ఆర్థిక మంత్రి చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

కిషన్ రెడ్డి తో మాట్లాడి ఆర్థిక పరిస్థితి పై తెలంగాణ మంత్రులను స్టడీ టూర్ కోసం బంగ్లాదేశ్ పంపిస్తామని హెచ్చరించారు.  కేంద్రం చేస్తోన్న సాయంపై అమరవీరుల స్థూపం వద్ద హరీష్ తో చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. గతంలో భారతదేశం గురించి మాట్లాడిన కవితకు ప్రజలిచ్చిన తీర్పే హరీష్ రావుకు ఇస్తారని హెచ్చరించారు.  ప్రజల పై ప్రేముంటే గ్యాస్ సిలిండర్ పై తెలంగాణ ప్రభుత్వం వసూలు చేస్తోన్న 291 రూపాయల టాక్స్ ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు.  

పెట్రోల్ పై తెలంగాణ ప్రభుత్వం  27రూపాయల టాక్స్ ప్రజల కోసం ఎత్తివేస్తోందా?  హరీష్ కు చిత్త శుద్దీ  ఉంటే సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలకు ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.  కేంద్రం సాయం చేయకుంటే ఉచిత కరెంటు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేదా? కరెంట్ ఇచ్చి ఆడిట్ అడగటం తప్పు ఎలా అవుతోందో హరీష్ చెప్పాలి ? అని చురకలు అంటించారు.  గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్ కు రైల్వే లైన్ ఎవరిచ్చారో హరీష్ గుర్తు చేసు కోవాలన్నారు.  డీఎస్సీ నిర్వహించలేని చేతకానిది  టీఆర్ఎస్ ప్రభుత్వమని మండిపడ్డారు.  ఆర్టీని ప్రైవేటీకరణ చేసిందెవరో హరీష్ రావు చెప్పాలన్నారు.  అభివృద్ధిని పరిచయం చేసిందే తానని హరీష్ బాగా ఊదుకోవటం హ్యాస్యాస్పదమని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: