తొక్కిసలాటలో ఏడుగురు మృతి.. మనోళ్లు మాత్రం..!
మరోవైపు ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల చెర నుంచి భారతీయులను రక్షించి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కేంద్రం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 168మందితో అక్కడి నుంచి బయలు దేరిన సీ-17 విమానం గాజియాబాద్ లోకి హిండన్ వైమానిక స్థానరంలో సురక్షితంగా దిగింది. 107 భారతీయులు సహా మొత్తం 168మంది వాయుసేన విమానంలో భారత్ చేరుకున్నారు. వీరిలో ఆప్ఘాన్ ఎంపీ కూడా ఉన్నారు.
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ లు ఉన్నత విద్యపై కీలక ఆదేశాలు జారీ చేశారు. కోఎడ్యుకేషన్ క్యాన్సిల్ అవ్వగా.. మహిళా ఉపాధ్యాయులు కేవలం అమ్మాయిలకే బోధించాలనీ.. మగ విద్యార్థులకు బోధించకూడదని ఆదేశించారు. తాలిబన్ల తాజా నిర్ణయంతో ప్రైవేట్ విద్యాసంస్థలకు ఇబ్బందులు రానున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీల్లో సుమారు 40వేల మంది విద్యార్థులు 2వేల మంది బోధనా సిబ్బంది ఉన్నారు.
ఇక మన దేశంలోకి లష్కరే తోయిబా, జైషే మహ్మద్ లాంటి ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదుల చొరబాట్లు పెరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇన్నేళ్లుగా తాలిబన్లకు సాయం అందించేందుకు ఈ సంస్థలు తమ ఉగ్రవాదులను అక్కడికి పంపాయని.. ఇప్పుడు ఆప్ఘాన్ లో తాలిబన్ల రాజ్యం వచ్చేయడంతో ఈ సంస్థలు భారత్ పై దృష్టి పెడతాయని తెలిపాయి. ఆప్ఘాన్ జైళ్ల నుంచి తాలిబన్లు విడుదల చేసిన వారిలో ఎక్కువగా ఈ సంస్థల ఉగ్రవాదులే ఉన్నట్టు చెప్పాయి.