తాలిబన్లకు డెల్టా వేరియంట్ గురించి తెలుసా.. ఎలన్ మస్క్ ప్రశ్న?

praveen
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడి పోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో కొత్త కొత్త వేరియంట్ లు పుట్టుకొస్తున్నాయ్. ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఒక దశ కరోనా వైరస్ సమర్థవంతంగా ఎదుర్కొన్నామని  ఊపిరి పీల్చుకునే లోపు మరొక రకం వేరియంట్ దూసుకొస్తోంది.  దీంతో ప్రపంచం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడి పోతానే ఉంది. ఇక ప్రస్తుతం ప్రపంచ దేశాలను డెల్టా అనే వేరియంట్ వణికిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వందల దేశాలకు పాకి పోయింది.



 ఇక వేగంగా వ్యాప్తి చెందడమే కాదు ఎంతగానో ప్రభావం కూడా చూపిస్తుంది. దీంతో ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచ దేశాలు డెల్టా వేరియంట్ తో వణికిపోతుంటే ఆఫ్ఘనిస్థాన్లో తాలిబాన్లు మాత్రం అరాచకాలు సృష్టిస్తున్నారూ. కనీసం ఎక్కడ కరోనా నిబంధనలు పాటించడం లేదు  ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించి వెలుగులోకి వస్తున్న ఫోటోలలో ఎక్కడ తాలిబన్లు  మాస్కు ధరించి ఉన్నట్లు మాత్రం కనిపించడం లేదు.  దీంతో తాలిబన్లు అసలు కరోనా వైరస్ నిబంధనల పాటిస్తున్నారా లేదా అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .



 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ తన సందేహాన్ని బయట పెట్టారు  డెల్టా వేరియంట్ ఉందని అసలు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తాలిబన్లకు తెలుసా అంటూ ప్రశ్నించారు. అంతే కాదు దీనికి సంబంధించిన ఒక ఫోటో కూడా షేర్ చేశాడు  ఇక ఈ ఫోటోలో తాలిబన్లు ఎక్కడ కరోనా ప్రోటోకాల్ పాటించకుండా కనీసం మాస్క్ లు కూడా ధరించకుండా ఉండడం కనిపిస్తుంది. ఇక దీనిపై స్పందిస్తూ నెటిజన్లు మాకు కూడా అదే డౌట్ వస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ సందేహం మాత్రం సరికొత్త చర్చకు దారితీసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: