యోగికి మళ్ళీ సీఎం అయ్యే ఛాన్స్ ఉందా ?

VAMSI
మరో ఏడు నెలల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇవి బీజేపీకి చాలా ముఖ్యమైన ఎన్నికలనే చెప్పాలి. ఈ రాష్ట్ర ఎన్నికల ఫలితం మీదనే కేంద్రంలో ఎవరి అధికారంలోకి రానున్నారనే విషయం ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే అధిక ఎంపీ స్థానాలున్నది ఈ రాష్ట్రంలోనే. ప్రస్తుతానికి యూపీలో బీజేపీ అధికారంలోకి ఉంది. మరియు యోగి ఆదిత్యానాధ్ సీఎంగా కొనసాగుతున్నారు. ఇక్కడ అభివృద్ధిని బట్టే గెలుపు అవకాశాలు ఉంటాయని గతంలో చాలా సార్లు నిరూపితం అయింది. గత ఎన్నికల్లో అయితే బిజెపి గెలిచింది కానీ ఈసారి పోటీ రసవత్తరంగా ఉండేలా ఉంది. వ్యక్తిగతంగా యోగి ఆదిత్యానాధ్ పాలన బాగున్నప్పటికీ దేశ వ్యాప్తంగా కొన్ని విషయాలలో దారుణంగా విఫలం అయిన మోదీ సర్కారుపై యూపి రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారట.

తను సీఎం గా ఉన్న కాలంలో రాష్ట్రంలో అవినీతి భారీగా తగ్గిపోవడం మరియు పాలనా పరంగా వేగవంతమైన చర్యలు తీసుకోవడం. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని సక్రమంగా జరిగేలా చేయడం. ఇది ఎంతో మంది హిందువులకు ఒక సెంటిమెంటుగా ఉండడంతో, ఈ విషయంలో యూపీ ప్రజలు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పవచ్చు. రాష్ట్రంలో ప్రధానమైన శాంతి భద్రతల విషయంలో కట్టుదిట్టమైన నియమ నిబంధనలతో నియంత్రణలో ఉంచడం. దాదాపుగా చాలా మంది ప్రజలు ఆదిత్యానాద్ కు సీఎంగా మరొక్క అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.  అంతే కాకుండా ఎక్కువ మంది బ్రాహ్మణులు యోగీనే అభిమానిస్తున్నట్లుగా సమాచారం.

 యోగిని ఈ క్రింది అంశాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. యోగి ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల వ్యవహారం ఇతనికి వ్యతిరేకంగా మారేలా ఉంది. రాష్ట్రములో అవినీతి శాతం తగ్గినా అధికారులు మాత్రం అవినీతికి పాలవుతుండడం విచారించదగ్గ విషయం. ఈ సంవత్సరం ఎక్కువగా హాట్ టాపిక్ గా మారిన రైతులకు సంబంధించి కొత్తగా తీసుకువచ్చిన మూడు చట్టాలు. ఈ విషయంపై దేశ వ్యాప్తంగా రైతుల నిరసనలు ఏ విధంగా జరిగాయో చూశాము. కాబట్టి రైతుల అసంతుర్ప్తి ఇక్కడ బయటపడే ఛాన్సెస్ ఎక్కువ.  అంతే కాకుండా విద్యుత్ చార్జీలను సార్థం భారీగా పెంచడం ప్రతికూలంగా మరిచే. సామాన్యుడు చాల ఇబ్బంది పడే విషయాలలో కరెంటు చార్జీలు పెంచడం ఒకటి.

ఈ సంవత్సరం మోదీ ప్రభుత్వం విఫలమయిన విషయాలలో, కరోనా సమయంలో దేశం మొత్తం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది, హాస్పిటల్స్ లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా, మెడిసిన్ అందుబాటులోకి లేకుండా ఎంతోమంది తమ ప్రాణాలను కోల్పోయారు. కరోనాను నిలువరించడంలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఇతర దేశాలు సైతం మనపై దుమ్మెత్తిపోశాయి. సామాన్యులకు నిత్యావసరమైన పెట్రోల్ మరియు డీజిల్ ధరలను అమాంతం పెంచేయడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మోదీ ప్రభుత్వంపై ఈ సారి వ్యతిరేకత చాలానే ఉంది. అయితే యూపీలో ఈ ప్రభావం పెద్దగా కనిపించకపోయినా ఇతర రాష్ట్రాలలో మోదీ వ్యతిరేక సెగ బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: