వారి వల్లే అవకాశాల్లేవ్.. మనో ఆవేదన!!

Hareesh
This is Article Description
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,  సంగీత దర్శకుడిగా తనకంటూ పెద్ద ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు గాయకుడు మనో. ప్రస్తుతం పాటలు పాడుతూనే కొన్ని సినిమాలకు డబ్బింగ్ చెబుతూ బుల్లితెర షో లకు జడ్జిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఆయన ముఖ్య పాత్రలో నటించిన క్రేజీ అంకుల్స్ సినిమా ఆగస్టు 19 థియేటర్లలో విడుదల కాబోతుంది.
ఈ  ముగ్గురు క్రేజీ అంకుల్స్ లో కీలక పాత్ర పోషించిన మనో ఈ చిత్ర విశేషాలను వెల్లడించారు.
ఐదు పదుల వయస్సు దాటినా ముగ్గురు స్నేహితులు ఓ యువ గాయని పై మనసు పడి ఆ తర్వాత ఆమెను కలుసుకునేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల ద్వారా ఎటు వంటి సమస్యల్లో చిక్కుకున్నారు అనేదే ఈ సినిమా కథ. ఈ సినిమాలో బంగారం షాపు యజమాని గా మనో ఎంతో వినోదాత్మకమైన పాత్రను చేశారని చెప్పారు. జోవియల్ గా ఈ పాత్ర ఉంటుందట.
ప్రేక్షక దేవుళ్ళు థియేటర్స్ కు వచ్చి తమను ఆశీర్వదిస్తారనే నమ్మకంతో ఈ సినిమా థియేటర్లలో విడుదల చేస్తున్నాం అన్నారు. ఇప్పటి జెనారేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని చెప్పారు.

అలాగే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పాటల విధానం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తను నటుడుగా మారడానికి ఇప్పుడు ఉన్న యువ గాయకులు కారణమని చెప్పారు మనో. ఇది ఇండస్ట్రీ కి మంచి పరిణామం అని చెప్పారు. వారి వల్ల తనకు అవకాశాలు రావట్లేదన్న విషయం నిజమే అయినా దానికి ఏమాత్రం బాధ లేదని, ఇంకా సంతోషంగా ఉందని అందుకే నటనవైపు వచ్చాను ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు 13 భాషల్లో కలిపి 25 వేలకు పైగా పాటలు పాడారు. ఇవే కాకుండా కొన్ని ప్రైవేటు ఆల్బమ్స్ లో కూడా మరో 25 వేల పాటలు పాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: