కరోనా ఏమని వచ్చిందో గాని.. అప్పటి నుండి పిల్లలకు ఇది పెద్ద టెన్షన్ లా మారింది. పెద్దవాళ్ళు మాస్కులు వేసుకునో, శానిటైజర్ లు రాసుకునో బయటకు వచ్చేస్తున్నారు. కానీ పిల్లల్ని మాత్రం గడప దాటనివ్వడం లేదు. ఓ వైపు స్నేహితులతో కలసి ఆడుకోవడానికి పంపడం లేదు, మరో వైపు పేరెంట్స్ తమ పిల్లల్ని సరదాగా బయటకు తీసుకెళ్లడం పూర్తిగా మానేశారు. ఇంకో వైపు అతి పెద్ద సమస్య
కరోనా భయంతో స్కూళ్లకు గత రెండేళ్ల నుండి తాళాలు పడ్డాయి. ఈ మధ్య అలా తెరచి
కరోనా వ్యాప్తి పెరగడంతో మళ్ళీ క్లోజ్ చేసేశారు. ఇలా చిన్నారులు బయట ప్రపంచానికి దూరమై మానసిక వికాసం పరిణితి చెందడం లేదు. తాజాగా నిపుణుల సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ లో
గవర్నమెంట్ స్కూల్స్ రీ ఓపెన్ కాగా తల్లితండ్రులకు మాత్రం
కరోనా భయం తగ్గడం లేదు. స్కూల్స్ కి పంపితే నలుగురు మధ్య ఉండాల్సిన పరిస్థితి కావడంతో ఎక్కడ కరోనా అటాక్ అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మరో వైపు వారి చదువు పూర్తిగా స్తంభించి పోతోందని టెన్షన్ పడుతున్నారు.
అయితే ఈ విషయంపై ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులు ఏమంటున్నరంటే...పిల్లల్ని
స్కూల్ కి పంపించడమే ఉత్తమం అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే పిల్లలు అభ్యాసం లేక చాలా వెనుకబడిపోయారు, ఆహ్లాదకరమైన వాతావరణం, స్నేహితులంటూ తోటి పిల్లలతో ఆట పాటలు లేక వారిలో సోమరితనం పెరిగే అవకాశం ఉంది. ఇన్నాళ్ల నుండి స్కూల్స్ లేకపోవడంతో చాలా మంది పిల్లలు
ఫోన్ లకే పరిమితమవుతున్నారు ఇవి కొత్త ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం లేకపోలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో విద్యార్థులను స్కూల్స్ కు పంపడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. అంతే కాకుండా ప్రస్తుతం
కరోనా వ్యాధి తగ్గిన నేపథ్యంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యక్తం చేస్తున్నారు. థర్డ్ వేవ్ గురించి లేనిపోని అపోహలు పెట్టుకొని పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయకుండా స్కూళ్లకు పంపడమే శ్రేయస్కరమని చెబుతున్నారు.
అంతే కాకుండా
కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఈ వైరస్ పిల్లలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అని ...ఇపుడు కూడా అదే విధంగా పిల్లలు సురక్షితంగా ఉండగలరని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. సుదీర్ఘ కాలం విద్యార్థులను
స్కూల్ కు పంపకపోవడం వలన కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని, కాబట్టి స్కూల్స్ కి పంపాలని సూచిస్తున్నారు. మరి తల్లితండ్రులు అందరూ తమ పిల్లల్ని స్కూల్స్ పంపడానికి దైర్యం చేస్తారా లేదా చూడాలి. అయితే స్కూల్స్ రీ ఓపెన్ చేసి మొదటి రోజే పెద్ద ఎత్తున పిల్లలు బడి దారి పట్టగా...ఇది ఇలాగే కొనసాగుతుందా లేదా అన్నది తెలియాల్సిన విషయం.