వారెవ్వా రైతన్న.. నీ దేశభక్తికి సలాం?

praveen
నేడు 130 కోట్ల భారత ప్రజానీకం మొత్తం 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంది. కాగా నేడు ఉదయంనుంచే ఇక దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుంది.  గ్రామాలు పట్టణాలు నగరాలు ఇలా అన్ని ప్రాంతాలలో కూడా భారత జాతీయ జెండాను ఎగురవేసి ఇక జెండా వందనం చేశారు ఎంతో మంది ప్రముఖులు. అయితే ఎవరైనా సరే ఇక దేశభక్తి చాటుకునేందుకు జెండా ఎగర వేసేందుకు అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కొంతమంది వ్యక్తులు తమలోని దేశ భక్తిని చాటుకునేందుకు వినూత్నంగా జెండావందనం జరుపుకుంటూ ఉంటారు.

 ఏకంగా భారీగా జన సమూహం తో భారతదేశ చిత్రపటాన్ని తలపించే విధంగా మానవహారం నిర్వహించి ఇక మధ్యలో జెండా వందనం చేసి తమ దేశ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఇటీవలే ఒక రైతు కూడా తనలోని దేశ భక్తిని చాటుకునేందుకు ప్రయత్నించాడు. ఇక ప్రస్తుతం రైతు చేసిన వినూత్న ప్రయత్నం ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భారతదేశంలో రైతే రాజు అనే విషయాన్ని తెలియ జేసే విధంగా ఏకంగా తన పంట పొలంలో భారతదేశ చిత్ర పటాన్ని వేసి అందరిని చూపును ఆకర్షిస్తున్నాడు. తెలంగాణాలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు తన దేశభక్తిని ఇలా వినూత్నంగా చాటుకున్నాడు.

 కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్ద కురుమ పల్లి గ్రామానికి చెందిన మల్లికార్జున్ రెడ్డి జాతీయ ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. ఇక ఇటీవల ఈ రైతు తనలోని దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. ఏకంగా వరి నాటు లోనే దేశ చిత్రపటాన్ని చిత్రీకరించి జాతీయ జెండాను ఎగరవేశారు. 20 గంటల విస్తీర్ణంలో దేశ చిత్రపటం వచ్చే విధంగా వరి నాటు వేయించాడు సదరు రైతు. ఇక నేటి నుంచి ఈ ఏడాది పొడవునా ప్రతిరోజు ఉదయం జాతీయగీతం పాడటంతో పాటు ఇక ఉదయం సమయంలో జెండా ఆవిష్కరించి ఇక సాయంత్రం సమయంలో జండా వితరణ చేస్తాను అంటూ ఆ రైతు చెబుతున్నాడు. రైతు దేశభక్తికి ప్రస్తుతం అందరూ మంత్రముగ్ధులు అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: