రూ.5లక్షలు.. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండానే..!

NAGARJUNA NAKKA
కరోనా బాధితులకు చికిత్స కోసం.. ప్రభుత్వ రంగ బ్యాంకులు పూచీకత్తు లేకుండా 5లక్షల రూపాయల వరకు రుణం ఇస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కోవిడ్-19 చికిత్స కోసం 5లక్షల రూపాయల వరకు రుణం ఇవ్వాలనీ.. ఆయా బ్యాంకుల పాలకమండళ్లు ఒక విధంగా తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ఇప్పటికే ఏపీలో 2వేల 791మంది, తెలంగాణలో 3వేల 389మంది ఈ రుణాలు పొందినట్టు మంత్రి తెలిపారు.
ఇక దేశం కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఐదు రాష్ట్రాల్లో మాత్రం ఆర్-వ్యాల్యూ ఒకటి కంటే ఎక్కువ నమోదవడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ లలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ లో ఆర్-వ్యాల్యూ 1.3గా ఉండగా.. ఇది పెరిగే సూచనలున్నాయని పేర్కొంది. ఇక గోవా, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాల్లో ఆర్ వ్యాల్యూ దేశ సగటులాగే ఒకటి ఉందని స్పష్టం చేసింది.
మరోవైపు తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందకపోవడం వల్లే.. ఈ ఏడాది మే 10న వెంటిలేటర్లపై ఉన్న కోవిడ్ బాధితులు మరణించినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ స్పష్టం చేశారు. ఆక్సిజన్ ట్యాంకర్ సరైన సమయంలో ఆస్పత్రికి చేరుకోలేదని ఏపీ ప్రభుత్వం ప్రాథమిక సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు.
ఇక కరోనా టీకాల మిక్సింగ్ పై ముందడుగు పడింది. కొవాగ్జిన్, కొవిషీల్డ్ మిక్సింగ్ పై అధ్యయనానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది. తమిళనాడులోని నెల్లూరు క్రిస్టియన్ కాలేజీలో 300మంది వాలంటీర్లపై స్టడీ జరుగనుంది. వీరికి కొవాక్జిన్,కొవిషీల్డ్ ఒక్కో డోసు ఇవ్వనున్నారు. ఒకే రకం వ్యాక్సిన్ కంటే రెండు వ్యాక్సిన్ల ద్వారా రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందని ఐసీఎంఆర్ అధ్యయనంలో తేలింది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: