అంబటి రాంబాబు విషయంలో.. జగన్ అలా చేస్తే.. వ్యతిరేకత వస్తుందేమో?
ఇలాంటి సమయంలో అంబటి రాంబాబు కు సంబంధించిన ఒక ఆడియో లీక్ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. గతంలో వైసీపీకి చెందిన పృథ్వి రాజ్ సంబంధించిన ఒక ఆడియో లీక్ మాదిరిగానే అంబటి రాంబాబు సంబంధించిన ఒక ఆడియో లీక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీనిపై అటు ప్రతిపక్ష పార్టీలు జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. సరిగ్గా మంత్రి పదవి దక్కుతుంది అనుకుంటున్న సమయంలో ఇలా జరగడంతో అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా నుంచి మంత్రి పదవి దక్కే వారి రేసులో అంబటి రాంబాబు పేరు ముందుగా ఉంది.
కానీ ఇంతలో అంబటి రాంబాబు కి సంబంధించిన ఒక ఆడియో లీక్ సంచలనంగా మారింది. ఇక సొంత పార్టీ నేతలే అంబటి రాంబాబు ఇరికించారు అన్న టాక్ కూడా వినిపిస్తోంది. మంత్రి పదవి దక్క కుండా చేసేందుకే ఈ ప్లాన్ వేసారు అని పలువురు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో అంబటి రాంబాబు కి సంబంధించిన ఆడియో లేక జగన్ కు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది అని చెప్పాలి. గతంలో పృథ్వీరాజ్ కు సంబంధించిన ఆడియో లీక్ కావడంతో ఇక అధిష్ఠానం సీరియస్గా తీసుకుని svbc చైర్మన్ పదవికి పృథ్వి రాజ్ ను రాజీనామా చేయించింది. మరి ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో కూడా జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఇక జగన్ పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని అంతే కాకుండా అటు ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే అవకాశం కూడా ఉంది టాల్ అనిపిస్తుంది ఏం జరుగుతుందో చూడాలి మరి.