వాట్సాప్ లో.. టైప్ చేయకుండానే మెసేజ్ పంపడం ఎలాగో తెలుసా?

praveen
ఒకప్పుడు ఏవైనా సందేశాలు పంపించడం అంటే ఏకంగా ఒక ఉత్తరం రాసి దాని మీద స్టాంపులు అతికించి పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పోస్ట్ బాక్స్ లో వేయాలి. ఆ తర్వాత పోస్ట్మాన్  మనం వేసిన పోస్టును అందాల్సిన వారికి చేరుస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇంత ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది.  ఎవరికైనా సందేశం పంపాలి అంటే పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు.  ఎన్నో రకాల ఆన్లైన్ మెసేజింగ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.  ఈ నేపథ్యంలో అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ చేస్తే చాలు..  మనం పంపాలనుకున్న సందేశం ఎదుటి వ్యక్తి కళ్ళముందు వాలిపోతుంది.



 ఇలా టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ఇక మనిషికి అన్ని పనులు సులభంగానే మారిపోతున్నాయి. మొన్న ఉత్తరాలు నిన్న ఆన్లైన్ లో మెసేజ్లు ఇక ఇప్పుడు మెసేజ్ టైప్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనకు కావాల్సిన సమాచారాన్ని టైప్ చేయకుండానే పంపొచ్చు. ప్రస్తుతం అతి ఎక్కువగా వాడుకలో వున్న ఆన్లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో ఈ సర్వీస్ ప్రస్తుతం అందుబాటులో ఉంది   మీరు టైప్ చేయకుండానే వాట్సాప్ మెసేజ్ పంపవచ్చు. కొన్ని కొన్ని సార్లు తీరిక లేనంత పని ఉన్నప్పుడు కొన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి. వారికి తప్పనిసరిగా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో  పని చేసుకుంటూనే వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపించవచ్చు. అది కూడా టైప్ చేయకుండానే.



 దీనికోసం ఆండ్రాయిడ్ మొబైల్ యూస్ చేస్తున్న వారందరూ ముందుగా గూగుల్ అసిస్టెంట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక ఈ యాప్ లో మీ జిమెయిల్ తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ సందర్భంలో ok google లేదా హే గూగుల్ అని ఫోన్ మైక్ వద్ద పిలిస్తే చాలు ఇక గూగుల్ అసిస్టెంట్ ప్రారంభం అవుతుంది. ఇక యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫోన్ లాక్ లో కూడా గూగుల్ అసిస్టెంట్ పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత మీరు ఓకే గూగుల్ లేదా హె google అని పిలిచిన సెకండ్లలోనే ఇక గూగుల్ అసిస్టెంట్ మీతో మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే మీరు ఎవరికి మెసేజ్ పంపాలి అనుకున్నారు వారి పేరు చెప్పి తర్వాత మెసేజ్ టైప్ చేయమని ఆదేశాలు ఇస్తే చాలు మీరు పంపాలనుకున్న సమాచారం టైప్ చేస్తుంది గూగుల్ అసిస్టెంట్.. ఆ తర్వాత మీరు మెసేజ్ చూసి ఓకే సెండ్ ఇట్ అని ఆదేశాలు ఇస్తే టైప్ చేయకుండానే మీరు పంపాల్సిన మెసేజ్ని అవతలి వ్యక్తికి వెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: